YS Jagan Disproportionate Assets Case: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ మళ్లీ మొదటికొచ్చింది. డిశ్చార్జి పిటిషన్లపై తీర్పు వెల్లడించాల్సిన సమయంలో సీబీఐ కోర్టు న్యాయమూర్తి బదిలీ కావడంతో పిటిషన్లు రీఓపెన్ చేశారు. డిశ్చార్జి పిటిషన్లను తేల్చేందుకు హైకోర్టు ఇవాళ్టి వరకు గడువు విధించినప్పటికీ, తన అనారోగ్యం కారణంగా తీర్పులు సిద్ధం కాలేదని జడ్జి తెలిపారు. గడువులోగా తీర్పు ఇవ్వలేక పోవడానికి కారణాలను వివరిస్తూ హైకోర్టుకు లేఖ రాశారు. సీబీఐ, ఈడీ కేసుల్లోని 130 డిశ్చార్జి పిటిషన్లపై కొత్త జడ్జి మళ్లీ వాదనలు వినేందుకు మే 15కి వాయిదా వేశారు.
ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ కొనసాగుతూనే ఉంది. సీబీఐ కోర్టు జడ్జి బదిలీతో డిశ్చార్జి పిటిషన్లపై విచారణ మళ్లీ మొదటి కొచ్చింది. రేపు రిలీవ్ కానున్న సీబీఐ కోర్టు జడ్జి సీహెచ్.రమేష్ బాబు, తన అనారోగ్యం కారణంగా తీర్పులు సిద్ధం కాలేదని వెల్లడించారు. కొత్త జడ్జి మళ్లీ మొదట్నుంచి వాదనలు వినేందుకు డిశ్చార్జి పిటిషన్లను మే 15కి వాయిదా వేశారు. జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ 11, ఈడీ 9 ఛార్జిషీట్లు వేశాయి. కేసుల నుంచి తొలగించాలని కోరుతూ జగన్, విజయసాయిరెడ్డి, అయోధ్యరామిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి, జె.గీతారెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్, నిమ్మగడ్డ ప్రకాష్, పి.శరత్ చంద్రారెడ్డి, పి.ప్రతాప్ రెడ్డి, పునీత్ దాల్మియా, జితేంద్ర వీర్వాణి, నిత్యానందరెడ్డి, పీవీ రాంప్రసాద్ రెడ్డి, శ్రీలక్ష్మి, ఎం.శామ్యూల్, బీపీ ఆచార్య, జి.వెంకట్రామిరెడ్డి, మన్మోహన్ సింగ్, వి.డి.రాజగోపాల్, ఎస్.ఎన్.మొహంతి, తదితరులు సీబీఐ కోర్టులో డిశ్చార్జి పిటిషన్లు వేశారు. సీబీఐ కోర్టులో 2013 నుంచి దాఖలైన డిశ్చార్జి పిటిషన్లు ఇప్పటికీ తేలడం లేదు. సుదీర్ఘ వాదనలు కొంత వినగానే జడ్జీలు బదిలీ కావడంతో.. మళ్లీ మొదట్నుంచి ప్రారంభమవుతున్నాయి.
చెల్లెమ్మ ప్రశ్నకు బిక్కమొహం వేసిన జగనన్న - YCP Social Media Activists