ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తండ్రి- కుమార్తె వీడియోపై అసభ్య వ్యాఖ్యలు - యూట్యూబర్ ప్రణీత్​ హనుమంతు అరెస్ట్ - YouTuber Praneeth Hanumanthu Arrest - YOUTUBER PRANEETH HANUMANTHU ARREST

YouTuber Praneeth Hanumanthu Controversy: ఎట్టకేలకు యూట్యూబర్​ ప్రణీత్​ హనుమంతు అరెస్ట్​ అయ్యాడు. సామాజిక మాధ్యమంలో తండ్రి- కుమార్తె వీడియోపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పరారీలో ఉన్న మరికొంత మంది నిందితుల కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు.

YOUTUBER HANUMANTHU ARREST
YOUTUBER HANUMANTHU ARREST (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 10, 2024, 10:28 PM IST

YouTuber Praneeth Hanumanthu was Arrested : సామాజిక మాధ్యమంలో తండ్రి-కుమార్తె వీడియోపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్​ను పోలీసులు అరెస్టు చేశారు. కేసులో కీలక నిందితుడిగా ఉన్న ప్రణీత్​ హనుమంతును సైబర్​ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు పట్టుకున్నారు. స్నేహితులతో వీడియో చాటింగ్‌ చేస్తూ అసభ్యకర మాటలతో రెచ్చిపోయిన యూట్యూబర్‌ ప్రణీత్‌ హనుమంతును పోలీసులకు చిక్కాడు. తండ్రీ కుమార్తెల బంధంపై విచక్షణ మరచి మాట్లాడాడు. ఓ వీడియోలో తండ్రి, కుమార్తె బంధంలో అశ్లీలం ధ్వనించేలా మిత్రులతో చిట్‌చాట్‌ చేశాడు. సామాజిక మాధ్యమాల్లో ఇంత దారుణంగా వీడియోలు చేయడంపై సినీ నటుడు సాయిదుర్గ తేజ్‌ ఎక్స్‌ వేదికగా ఆదివారం స్పందించారు.

ఇట్స్ నాట్ ఫన్!! అది నోరా డ్రైనేజా? - యూట్యూబర్​పై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు - YouTuber P Hanumanthu Controversy

ఇలాంటి వారిని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవాలంటూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి, చంద్రబాబులతోపాటు మరి కొందరికి ట్యాగ్‌ చేశారు. దీనిపై స్పందించిన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చర్యలకు ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం కేసు నమోదు చేసిన టీజీ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు దర్యాప్తు చేపట్టారు. బెంగళూరులో ప్రణీత్‌ను తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు అదుపులోకి తీసుకుని స్థానిక కోర్టులో హాజరుపర్చారు.

తండ్రి కుమార్తెల బంధంపై అసభ్యకర వ్యాఖ్యలు చేశాడని అభియోగంతో పోక్సో సహా పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్‌ నమోదైంది. పరారీలో ఉన్న మరి కొంత మంది కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రణీత్‌ను బెంగళూరు నుంచి పోలీసులు తెలంగాణలోని హైదరాబాద్​కు తరలించారు. పరారీలో ఉన్న మరికొంత మంది నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

హీరో రాజ్​ తరుణ్​పై కేసు నమోదు - తానే అబార్షన్​ చేయించాడన్న లావణ్య - Police File A Case Actor Raj Tarun

ABOUT THE AUTHOR

...view details