ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డిజిటల్ యుగంలోనూ పుస్తక పఠనంపై పెరుగుతోన్న ఆసక్తి - Youth interested For Reading Books - YOUTH INTERESTED FOR READING BOOKS

Youth Getting interested For Reading Books: ప్రస్తుత డిజిటల్​ యుగంలో పుస్తక పఠనంపై యువతలో క్రమంగా ఆసక్తి పెరుగుతోంది. పుస్తకాలతోపాటు, పత్రికలు చదివేందుకు ఆసక్తి చూపుతున్నట్లు విజయవాడ గ్రంథాలయ నిర్వాహకులు చెబుతున్నారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించిన తర్వాత పుస్తక పఠనానికి చాలా మంది ప్రాధాన్యత ఇస్తున్నట్లు వారు పేర్కొన్నారు.

Youth Getting interested For Reading Books
Youth Getting interested For Reading Books (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 18, 2024, 3:00 PM IST

Youth Getting interested For Reading Books : ఒక మంచి పుస్తకం వంద మంది స్నేహితులతో సమానం. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ మంచి పుస్తకం కొనుక్కో అన్నారు కందుకూరి వీరేశలింగం పంతులు. ప్రస్తుత డిజిటల్‌ యుగంలో పుస్తక పఠనంపై యువతలో క్రమంగా ఆసక్తి పెరుగుతోందని విజయవాడ గ్రంథాలయ నిర్వాహకులు తెలిపారు. పుస్తక పఠనంపై యువత క్రమంగా ఆసక్తి పెంచుకుంటున్నట్లు తెలిపారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించిన తర్వాత పుస్తక పఠనానికి చాలా మంది ప్రాధాన్యత ఇస్తున్నారు. తరగతి పుస్తకాలే కాకుండా సమాజానికి ఉపయోగపడే పుస్తకాలను అధ్యయనం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

మార్కుల కోసమో, కొలువుల కోసమో కాకుండా తెలియని విషయాలు తెలుసుకోవడం కోసం పుస్తక పఠనం అలవర్చుకుంటున్నారు. ఈ విషయాన్ని విజయవాడ గ్రంథాలయ నిర్వాహకులు చెప్పారు. పుస్తకాలే కాక, వార్తా పత్రికలు చదివే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఒక అంశంపై సంపూర్ణ అవగాహన రావాలంటే అధ్యయనం ఏకైక మార్గమని తెలిపారు. 300 నుంచి 400 మంది వరకు సభ్యత్వం తీసుకున్నారని నిర్వహకులు వెల్లడించారు.

వేసవి శిక్షణ శిబిరాల్లో విజ్ఞానం, వినోదం - చిన్నారుల్లో నూతనోత్సాహం - Summer camps for children

పుస్తక పఠనంపై యువత ఆసక్తి: గత కొన్నేళ్లుగా పుస్తక పఠనంపై చాలా మందిలో ఆసక్తి తగ్గినా ప్రస్తుతం మళ్లీ అది పెరుగుతోంది. విద్యార్థులు, యువత, మహిళలు చదవడానికి ఆసక్తి చూపుతున్నారు. గృహిణీలు ఖాళీ సమయాల్లో పుస్తక పఠనానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఉద్యోగాల కోసమే కాకుండా విజ్ఞానాన్ని పెంచుకోవాడనికి పుస్తకాలు చదువుతున్నారు. ప్రస్తుత డిజిటల్​ యుగంలో ఆన్​లైన్​లోనూ అనేక పుస్తకాలు, పత్రికలు యువత చదువుతున్నారు. అధ్యయనం ద్వారానే సమాజం అభివృద్ధి వైపు పయణిస్తుంది.

స్వాతంత్య్ర పోరాటంలో పుస్తకమే ఆయుధం: స్వాతంత్య్ర పోరాటంతోపాటు అనేక అభ్యుదయ పోరాటాలకు పుస్తక పఠనమే ఆయుధంగా పని చేసింది. ప్రస్తుతం విద్యార్థి స్థాయి నుంచే అధ్యయనం పట్ల ఆసక్తిని పెంచడానికి చర్యలు చేపడుతున్నారు. విద్యాసంస్థల్లో గ్రంథాలయాలను నెలకొలిపి పుస్తక పఠనాన్ని అలవరుస్తున్నారు. ప్రస్తుతం చిన్నారులు, యువత టీవీలు, స్మార్ట్ ఫోన్లలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. అటువంటి పరిస్థితి మారాలంటే పుస్తక పఠనం ఎంతో దోహదం చేస్తుంది. ఆన్​లైన్​లో పుస్తకాలు అందుబాటులో ఉండడంతో పాఠకులకు చదువుకునేందుకు అవకాశం ఉంటుంది. ప్రభుత్వం పుస్తక పఠనాన్ని ప్రోత్సహించాలని అందుకోసం మరిన్ని గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని గ్రంథాలయ నిర్వాహకులు విజ్ఞప్తి చేస్తున్నారు

బస్సులో మినీ లైబ్రరీ - యువ డ్రైవర్​ వినూత్న ఆలోచన - MINI LIBRARY IN BUS

స్వాతంత్య్ర ఉద్యమంలో గ్రంథాలయాలది కీలక పాత్ర - ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయాలి : వెంకయ్యనాయుడు

పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకుంటున్న యువత - అధ్యయనంతోనే సమాజ అభివృద్ధి (ETV Bharat)

ABOUT THE AUTHOR

...view details