తెలంగాణ

telangana

ETV Bharat / state

మత్తుమందు ఇచ్చి యువతిపై అత్యాచారం - ఆపై నగ్న చిత్రాలు తీసి బెదిరింపులు - Young Woman Rape Case In Borabanda

young woman Rape in Hyderabad : హైదరాబాద్ బోరబండకు చెందిన డిగ్రీ చదివే యువతికి మత్తు మందు ఇచ్చి ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. అంతటితో ఆగకుండా ఆమె నగ్నంగా ఉన్న ఫొటోలు సేకరించి బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ వ్యవహారంపై ఫిర్యాదు అందుకున్న బోరబండ పోలీసులు జీరో ఎఫ్ఐర్ నమోదు చేసి ఎల్బీనగర్ ఠాణాకు బదిలీ చేశారు.

Young Woman Rape Case In Borabanda
A young woman Raped Borabanda in Hyderabad

By ETV Bharat Telangana Team

Published : Mar 4, 2024, 12:52 PM IST

young woman Rape in Hyderabad :సమాజంలో రోజురోజుకూ అరాచకాలు పెరిగిపోతున్నాయి. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ఆడపిల్లయితే చాలనుకుని కొందరు మృగాళ్లలా ప్రవర్తిస్తున్నారు. వావివరసలు మరచి అత్యాచారాలకు తెగబడుతున్నారు. తమ కామవాంఛతో ఎన్నో కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా, ఎంత శిక్షించినా, కీచకుల ఆగడాలకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు.

తాజాగా హైదరాబాద్ బోరబండకు చెందిన యువతికి మత్తు మందు ఇచ్చి ఇద్దరు యువకులుఅత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆమె నగ్నంగా ఉన్న ఫొటోలు సేకరించి బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న బోరబండ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్‌ నమోదు చేసి కేసును ఎల్బీనగర్‌ ఠాణాకు బదిలీ చేశారు.

క్రికెటర్ సందీప్​కు 8 ఏళ్ల జైలు శిక్ష- మైనర్​పై అత్యాచారం కేసులో నేపాల్ కోర్టు తీర్పు

పోలీసుల వివరాల ప్రకారం :డిగ్రీ చదివే యువతి ఎల్బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటుంది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రణవ్‌ అనే యువకుడు పరిచయమయ్యాడు. రోజూ మెసేజ్ చేస్తూ అమ్మాయికి దగ్గరయ్యాడు. అలా యువతి చదువుకునే కళాశాల​ వద్ద ఇద్దరు తరచూ కలిసేవారు. గత సంవత్సరం యువతి చదివే కళాశాల వద్దకు ప్రణవ్‌ వెళ్లి ఎల్బీనగర్‌లోని ఇంటి వద్ద డ్రాప్‌ చేస్తానని నమ్మించి బైక్‌పై తీసుకెళ్లాడు. ఇంటికి కాకుండా దారిలో ఉన్న హోటల్‌కు తీసుకొని వెళ్లాడు. అక్కడ తాగునీటిలో మత్తు మందు కలిపి యువతి స్పృహ కోల్పోయాక ప్రణవ్‌, మరో యువకుడు కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.

Young Woman Rape Case In Borabanda : తర్వాత కోలుకున్న యువతి భయపడి జరిగిన విషయం ఇంట్లో చెప్పలేదు. రెండు నెలల క్రితం యువతి నివాసం బోరబండకు మార్చారు. అత్యాచారం విషయం ఎవరికీ చెప్పకపోవడాన్ని అవకాశంగా తీసుకున్న నిందితులు మళ్లీ ఫోన్‌ చేసి బెదిరించారు. ఆమె నగ్న చిత్రాలు తమ వద్ద ఉన్నాయని చెప్పినట్టు వినకుంటే సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరించారు. వేధింపులు ఎక్కువ కావడంతో యువతి తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చెప్పింది. తల్లిదండ్రులు బోరబండ పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

నిందితుడిపై రివెంజ్​- 8నెలల గర్భిణీపై గ్యాంగ్​రేప్​, పెట్రోల్ పోసి నిప్పు

పోర్న్​ వీడియోలు చూసి చెల్లిపై అన్న రేప్​- ఎవరికైనా చెప్పేస్తుందని హత్య

ABOUT THE AUTHOR

...view details