Young Man Died while Playing with a Dog : వీకెండ్‌ను సరదాగా ఎంజాయ్ చేసేందుకు కొంతమంది యువకులు ఓ హోటల్‌కు వెళ్లారు. హోటల్‌లో చెక్ ఇన్ అయ్యి తమకు కేటాయించినా గదులకు వెళ్లేందుకు మూడో అంతస్తుకు వెళ్లారు. అంతలోనే ఓ కుక్క బాల్కనీ వద్ద ప్రత్యక్షమైంది. దాన్ని చూసి ఓ యువకుడు సరదాగా దాన్ని ఆట పట్టిద్దామనుకున్నాడు. దాన్ని తరుముతూ వెంటపడ్డాడు. ఆ క్రమంలో పరిగెత్తుకుంటూ వెళ్లి అదుపుతప్పి మూడో అంతస్తులోని కిటికీ నుంచి కిందపడి మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగింది.
స్నేహితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ రామచంద్రాపురంలోని అశోక్‌నగర్‌లో తెనాలి యువకుడు ఉదయ్ (23) నివాసం ఉంటున్నాడు. ఆదివారం రోజున తన స్నేహితులతో కలిసి అతడు చందానగర్‌లోని వీవీప్రైడ్ హోటల్‌కు వెళ్లాడు. హోటల్ మూడో అంతస్తు బాల్కనీలోకి వచ్చాడు. అక్కడే ఉదయ్ ఓ కుక్కను చూశాడు. మొదట సరదాగా దాంతో ఆడుకోవాలనుకున్నాడు. ఆ తర్వాత దాన్ని కొట్టబోతూ, తరుముతూ ఆటపట్టించాడు. కానీ ఉదయ్ చేష్టలకు భయపడ్డ ఆ శునకం అక్కడి నుంచి పరిగెత్తింది.
దాని వెంటే ఉదయ్ కూడా పరిగెత్తాడు. అయితే ఆ బాల్కనీలో మలుపు వద్ద కుక్క యూటర్న్ తీసుకోగా, ఫాస్ట్‌గా పరిగెత్తిన ఉదయ్ ఎదురుగా ఉన్న కిటికీని పట్టుకోబోయాడు. సరదాగా బెదిరించాలని చూసి దాని వెనక పరిగెత్తాడు. మళ్లీ వెనక్కి తిరిగి దాని వెంట పరిగెత్తుకుంటూ వస్తూ ఎదురుగా ఉన్న కిటికీని పట్టుకోబోయాడు. కానీ అదుపుతప్పి కిటికీలో నుంచి కిందపడ్డాడు. మూడో అంతస్తులో ఉన్న ఆ కిటికీకి అద్దం లేకపోవడంతో ఉదయ్ కింద పడిపోయాడు.