Young Man Who Killed His Friend:ప్రేమించిన అమ్మాయి ఎవరితోనైనా కొంచెం క్లోజ్‌గా మాట్లాడినా, చనువుగా ఉన్నా ఎక్కువమంది యువకులు అది తట్టుకోలేరు. మాట్లాడటం మాన్పించడమో లేక ఆ అబ్బాయితో గొడవ పడటం లాంటివి చేస్తుంటారు. ఇలాంటివి కొన్ని హత్యలు చేసేంత వరకు వెళ్తుంటాయి.
ప్రస్తుత కాలంలో క్షణికావేశంలో మంచిచెడు ఏమీ ఆలోచించకుండా ప్రేమించిన వారికోసం ఎలాంటి పనులు చేయడానికైనా వెనకాడట్లేదు నేటి యువత. చేస్తున్న పని తప్పా, ఒప్పా అనేది పక్కనపెడితే క్షణికావేశంలో హత్య చేసి చిన్న వయస్సులో హంతకులుగా మారుతున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనే తెలంగాణలోని మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది. ప్రేమించిన యువతి తనని దూరం పెట్టి తన స్నేహితుడితో క్లోజ్‌గా ఉండడం చూసి తట్టుకోలేక హతమార్చిన ఉదంతమిది.
కువైట్ నుంచి వచ్చి చంపేశాడు - వీడియోతో వెలుగులోకి - ఆ తర్వాత ఏమైందంటే?
యువతి మాట్లాడడం చూసి సహించలేక:మేడ్చల్ జిల్లాలోని కాప్రా ఎల్లారెడ్డిగూడలో నివసించే మహిపాల్ యాదవ్, అహ్మద్‌కూడ రాజీవ్ గృహకల్పకు చెందిన పృథ్వీరాజ్ అనే వీరు స్నేహితులు. వీరికి కుషాయిగూడకు చెందిన ఒక యువతి పరిచయమైంది. కొంతకాలం తర్వాత ఆమె పృథ్వీరాజ్‌ను ప్రేమించి, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అయితే ఈ విషయమై ఆ యువతి ఇంట్లో చెప్పగా తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. తర్వాత ఆ యువతి పృథ్వీరాజ్‌ను దూరం పెడుతూ వచ్చింది. ఈ క్రమంలో మహిపాల్ యాదవ్‌తో చనువుగా ఉండటం మొదలు పెట్టింది. అది చూసిన పృథ్వీరాజ్ తట్టుకోలేకపోయాడు. మహిపాల్‌పై పృథ్వీరాజ్ కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా మహిపాల్‌ను హతమార్చి యువతిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
పక్కా ప్రణాలికతో హత్య :మహిపాల్‌ను చంపేందుకు ముందుగా పక్కా ప్లాన్ వేశాడు. అందుకు ఈ నెల 10న ఇద్దరూ దమ్మాయిగూడలో మద్యం సేవించారు. తర్వాత మహిపాల్ యాదవ్‌ను బైక్‌పై హరిదాస్‌పల్లి శివారులోని కొండపైకి తీసుకెళ్లాడు. అక్కడ చుట్టుపక్కలా అంతా గమనించి తన వెంట తెచ్చుకున్న కత్తితో మహిపాల్‌ని పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. ఉదయం స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా విరికొచ్చిన సమాచారం మేరకు పృథ్వీరాజ్‌ను అదుపులోకి తీసుకుని తమదైన రీతిలో విచారించారు. దీంతో అతను చేసిన నేరం ఒప్పుకున్నాడు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
మేనత్త కుటుంబంపై పగ - యూట్యూబ్‌లో శోధించి మరీ చోరీ
ఆన్‌లైన్‌లో విషం ఆర్డర్ చేసుకుని ఆత్మహత్య