Young Man Attacked Married Woman with Knife: 'నేను నిన్ను ప్రేమిస్తున్నా, నీ భర్తను వదిలి నన్ను పెళ్లి చేసుకో, లేకుంటే మీ ఇద్దరినీ చంపేస్తా' అంటూ ఓ యువకుడు వివాహితను బెదిరించి కత్తితో దాడి చేసిన ఘటన కృష్ణా జిల్లా గుడివాడలో చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని భీమవరం రైల్వే గేటు ప్రాంతంలో వివాహిత నివాసం ఉంటోంది. ఆమెకు భర్త, కుమార్తె ఉన్నారు. భర్త ఆగిరిపల్లిలో పని చేస్తుండగా ఆమె పట్టణంలో బ్యుటీషియన్‌గా పని చేస్తున్నారు.
2020లో పట్టణానికి చెందిన కె. జగదీష్ అనే యువకుడితో మహిళకు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో వీరు తరచూ ఫోన్‌లో మాట్లాడుకునేవారు. కొంత కాలంగా ఆమె జగదీష్ ఫోన్‌ను బ్లాకులో పెట్టింది. నాలుగు రోజుల కిందట జగదీష్ ఆ మహిళకు 206 సార్లు ఫోన్ చేస్తే ఆమె తీయలేదు. ఇంక జగదీష్ వేధింపులు తట్టుకోలేని ఆమె, జగదీష్ వేధిస్తున్నారని పెద్దలకు చెప్పి వారితో హెచ్చరించారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఆమె పని చేసే సెలూన్ వద్దకు జగదీష్ వచ్చి బయట వేచి ఉన్నాడు.