ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిద్రలేచే సరికి నీళ్ల మధ్యలో ఆవాసాలు- కాకినాడలో ఏలేరు ఉగ్రరూపం - Yeleru Floods in Kakinada - YELERU FLOODS IN KAKINADA

Yeleru Floods in Kakinada District : కాకినాడ జిల్లాలో 7 మండలాల్లో ఏలేరు విలయం సృష్టించింది. కాల్వలకు గండ్లుపడి ఊళ్లన్నీ జలమయమయ్యాయి. బయటకు అడుగుపెట్టేందుకూ వీలులేక గత రెండురోజులుగా ప్రజలంతా జలదిగ్బంధంలో చిక్కుకున్నారు.

YELERU FLOODS IN KAKINADA
YELERU FLOODS IN KAKINADA (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 11, 2024, 12:23 PM IST

Updated : Sep 11, 2024, 1:38 PM IST

Yeleru Floods in Kakinada District :సాయంత్రానికికళకళలాడిన పైర్లు తెల్లారేసరికి నీటమునిగాయి. నిద్రలేచేసరికి చుట్టూ నీళ్లే! అలా ఒకట్రెండు ఇళ్లు కాదు! ఊళ్లకు ఊళ్లది అదే పరిస్థితి. ఇంట్లో పొయ్యి వెలిగించే పరిస్థితి లేదు. బతుకు జీవుడా అంటూ ఇళ్లకు తాళాలు వేసి దాతలు ఇచ్చే ఆహారంతోనే పొట్ట పోసుకోవాల్సిన పరిస్ధితి. ఏలేరు ఉగ్రరూపానికి దాదాపు 7 మండలాలు నీటమునిగాయి.

ఏలేరు విలయం :కాకినాడ జిల్లాలోని ఏలేరు జలాశయానికి 46 వేల పైగా క్యూసెక్కుల వరద వచ్చిన వేళ అధికారులు దిగువకు గరిష్ఠ వరద వదిలారు. సోమవారం రాత్రి 27,500 క్యూసెక్కుల నీరు వదిలారు. ఇక అంతే! ఏలేరు కాల్వలు ఊళ్లను ఏకం చేశాయి. ఏలేశ్వరం, కిర్లంపూడి, పెద్దాపురం, సామర్లకోట, పిఠాపురం, గొల్లప్రోలు, జగ్గంపేట మండలాల్లోని లోతట్టు గ్రామాల్ని ఆకస్మికంగా వరద ముంచెత్తింది.

ఉప్పొంగుతున్న ఏలేరు- పిఠాపురం నియోజకవర్గంపై తీవ్ర ప్రభావం - Yeleru Canal Floods

జలదిగ్బంధంలోనే పలు గ్రామాలు : కిర్లంపూడి మండలంలో 12 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. భూపాలపట్నం, ఎస్.తిమ్మాపురం, శృంగరాయునిపాలెం, రాజుపాలెం,ముక్కొల్లు, రామకృష్ణాపురం, బూరుగుపూడి తదితర గ్రామాలు ముంపు భారీన పడ్డాయి. 7చోట్ల కాల్వలకు గండి పడి వరద ఉళ్లపై పడింది. ప్రత్తిపాడు-సామర్లకోట, భూపాలపట్నం, ఎస్.తిమ్మాపురం మధ్య రాకపోకలు అస్తవ్యస్తం అయ్యాయి. సామర్లకోట-పిఠాపురం రహదారిపై రాకపోకలు నిలిచాయి. పెద్దాపురం-గుడివాడ మధ్య రోడ్డు అర కిలోమీటరు వరకూ మునిగింది.

ఉత్తరాంధ్రలో వరద బీభత్సం - ప్రజాప్రతినిధులు పర్యటించి చక్కదిద్దే ప్రయత్నం - FLOOD EFFECT IN UTTARANDRA

62 వేల ఎకరాల్లో పంటలు మునక :ఏలేరు వరద రైతుల్ని నిండా ముంచింది. ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడుకుంటూ సాగు చేసిన పంట సరిగ్గా చేతికందాల్సిన సమయంలో మునిగింది. కాకినాడ జిల్లాలో దాదాపు 62,505 ఎకరాల్లో వ్యవసాయ పంటలు నీట మునిగినట్టు వ్యవసాయ శాఖ అంచనా వేస్తుంది. కిర్లంపూడి, గొల్లప్రోలు, పిఠాపురం మండలాల్లో నష్టం తీవ్రంగా ఉంది. ఈ సాయంత్రానికి ముంపు గ్రామాల్లో ఏలేరు వరద తగ్గుతుందని అంచనా వేస్తున్నా జరిగిన నష్టం నుంచి ప్రజలు ఇప్పట్లో కోలుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. పంటపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితులు కోరుకుంటున్నారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో నేడు కేంద్ర బృందం పర్యటన - ఏర్పాట్లు సిద్ధం - Central Team in Flood Areas

Last Updated : Sep 11, 2024, 1:38 PM IST

ABOUT THE AUTHOR

...view details