ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏటా పన్నులు పెంచుతాం-సౌకర్యాలు అడగొద్దు! నెల్లూరు కార్పొరేషన్ తీరుపై నగరవాసుల ఆగ్రహం - YCP Govt Imposing Unnecessary Taxes

YCP Govt Imposing Unnecessary Taxes Burden on Commoners Nellore : జగన్ అధికారంలోకి రాగానే పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. పన్నులు మాత్రం అమాంతరం పెంచేసి ప్రజలకు సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శంచారు. సంక్షేమం, అభివృద్ధిని విస్మరించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం గత 5 ఏళ్లుగా వివిధ పన్నలతో ప్రజల నడ్డి విరుస్తుందని విపక్ష నాయకులు మండిపడ్డారు. నె

ycp_govt_imposing_unnecessary_taxes_burden_on_commoners_nellore
ycp_govt_imposing_unnecessary_taxes_burden_on_commoners_nellore

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 13, 2024, 6:22 PM IST

YCP Govt Imposing Unnecessary Taxes Burden on Commoners Nellore :సంక్షేమం, అభివృద్ధిని విస్మరించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం గత 5 ఏళ్లుగా వివిధ పన్నలతో ప్రజల నడ్డి విరుస్తుందని విపక్ష నాయకులు మండిపడ్డారు. నెల్లూరు నగరంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ పన్నలతో సామాన్యులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారన్నారు. జగన్ అధికారంలోకి రాగానే పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. పన్నులు మాత్రం అమాంతరం పెంచేసి ప్రజలకు సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శంచారు.

నగర వాసులపై పన్నుల భారం- ఆర్థిక ఇబ్బందుల్లో సామాన్యులు

More House Taxes On People : నాలుగేళ్లుగా ఏటా 15 శాతం చొప్పున పెంపు చేస్తూ, ప్రజల సంక్షేమం, అభివృద్ధిని విస్మరించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం నగరాలు, పట్టణాల్లో వివిధ పన్నుల రూపంలో ప్రజల నడ్డివిరిచింది. పన్నులతోనే రాష్ట్ర పాలనను నడపాలనే రీతిలో ఈ తంతు కొనసాగింది. పట్టణాల్లో ఐదేళ్ళకు ఒకసారి ఆస్తి పన్నుపెంచే విధానాన్ని పక్కన పెట్టారు. ప్రతీ ఏడాది పెంచుతూ పోయే కొత్త విధానాన్ని తీసుకువచ్చారు. వైఎస్సార్సీపీ పాలన తీరును విమర్శిస్తూ ప్రతిపక్షాలు ఆందోళనలు చేసినా ఏ మాత్రం పట్టించుకోలేదు. నెల్లూరు నగరం, పట్టణాల్లో ప్రజల నడ్డివిరుస్తూనే ఉన్నారు.

'పన్నుల బాదుడుతో బాధలు తట్టకోలేమ్​ బాబోయ్​'

వైసీపీ ప్రభుత్వం ఆధికారంలోకి రాకముందు ఉన్న ప్రభుత్వాలు ఆస్తి పన్ను ఐదేళ్ళకు ఒకసారి పెంచేవి. పేద మధ్య తరగతి వర్గాలపై పెద్దగా భారం చూపించలేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత పరిస్థితి మారిపోయింది. ఏడాదికోసారి ఆస్తి పన్ను పెంచారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆస్తులు పెంచినప్పుడల్లా పన్ను మొత్తం పెంచుతున్నారు. వార్షిక అద్దె విలువ ఆధారంగా పట్టణ, నగరాల్లో ఆస్తి పన్ను పెంచేవారు. కానీ వైఎస్సార్సీపీ పాలనలో ఆస్తి ముూలధన విలువ ఆధారంగా పన్ను పెంచే విధానం అమలులోకి తెచ్చారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్​ల శాఖలతో లింకు పెట్టారు. పన్నులతో పేదలు, మధ్యతరగతి వర్గాలవారు అల్లాడిపోతున్నారు.

కొత్త బడ్జెట్​లో ఆ ఊరట లభిస్తుందా?

'ప్రజలకు సౌకర్యాలు మాత్రం ఏర్పాటు చేయడంలేదు. రోడ్లు ,మురుగు కాలువలు నిర్మాణం చేయడంలేదు. వార్డుల్లో సమస్యలు పరిష్కారించకుండా పన్నులు భారం మాపైమోపుతున్నారని విమర్శిస్తున్నారు. కాలువల్లో చెత్తతీయడంలేదు. సమావేశాల్లో కార్పోరేటర్లు విమర్శలు చేస్తున్నా నిధులు కేటాయించడంలేదు. అభివృద్ధి చేయడంలేదు.' - స్థానికులు

ప్రభుత్వాలు ప్రజలను ఆదుకునేలా ఉండాలి కాని, ఇబ్బంది పెట్టేలా ఉండకుడదని ప్రజలు అంటున్నారు. కోవిడ్ నుంచి ఆదాయాలు పెరగలేదని, నిత్యవసర ధరలు పెరిగాయని. కరెంట్ ఛార్జీలు పెరిగాయని. అప్పులు చేసి పన్నులు చెల్లిస్తున్నామని ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు.

నగరవాసులపై ఎడాపెడా పన్నుల మోత- 'ఎన్నికల్లో జగన్ సర్కార్​కు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరిక'

సౌకర్యాలు నిల్​- పన్నులు ఫుల్​

ABOUT THE AUTHOR

...view details