YCP Govt handed New Project to Megha Engineering :ఆంధ్రప్రదేశ్‌లోనిజగన్ సర్కార్ (YCP Government) మరో భారీ ప్రాజెక్టును అస్మదీయ కంపెనీలకు కట్టబెట్టింది. ఎన్నికల కోడ్‌కు ముందు ఆగమేఘాలపై రూ.12,264.36 కోట్లతో చేపట్టే కొత్త ప్రాజెక్టు పనులను మేఘా ఇంజినీరింగ్ సంస్థకు అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఎన్నికల ప్రకటన వెలువడే ముందు హడావుడిగా లెటర్ ఆఫ్ అవార్డును ఇవ్వడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
విశాఖలో మరో కొండకు గుండు కొడుతున్న వైసీపీ నేతలు - భారీ యంత్రాలతో తవ్వకాలు
అల్లూరి జిల్లాలోని ఎగువ సీలేరు పీఎస్‌పీ ఏర్పాటు కోసం రూ.6717 కోట్ల విలువైన పనులకు గుత్తేదారుల ఎంపిక కోసం ఏపీ జెన్‌కో(Andhra Pradesh Power Generation Corporation Limited) గత ఏడాది జూన్ 28న టెండర్లకు పిలిచింది. మేఘా, నవయుగ, రిత్విక్ జేవీ, జీపీవీఎల్ ఇంజినీరింగ్ లిమిటెడ్ సంస్థలు బిడ్‌లు వేశాయి. ప్రైస్ బిడ్‌లను 2023 నవంబరు 16న అధికారులు తెరిచారు. ఎల్1గా నిలిచిన మేఘా సంస్థ రూ.7,380 కోట్లకు బిడ్‌ను స్వాధీనం చేసుకుంది. టెండరు విలువపై 9.87 శాతం అధిక మొత్తానికి ప్రభుత్వం మేఘా సంస్థకు (Mega Company)పనులను కట్టబెట్టింది. ఈ నిర్ణయంతో గుత్తేదారు సంస్థకు రూ.663 కోట్ల ప్రజాధనాన్ని దోచిపెట్టింది.
Upper Sileru Pumped Storage Power Project : అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఎగువ సీలేరు దగ్గర పీఎస్‌పీ నిర్మాణానికి ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఒక్కొక్కటి 150 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న 9 యూనిట్ల ద్వారా 1350 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టు నిర్మాణానికి వైసీపీ సర్కార్ ప్రతిపాదించింది. దీని కోసం ఈపీసీ విధానంలో పనులను చేపట్టేలా గుత్తేదారుల ఎంపిక కోసం టెండర్లను పిలిచింది. పనులన్నింటితో పాటు నిర్మాణ సమయంలో వడ్డీ, ఎస్కలేషన్, 18 శాతం జీఎస్టీతో కలిపి రూ.12,264.36 కోట్లతో ప్రాజెక్టు అంచనాలను ఆమోదించింది.
ప్రాజెక్టు నిర్మాణానికి రూ.9485.99 కోట్లతో డీపీఆర్‌ను వ్యాప్కోస్ సంస్థ 2022 నవంబర్‌లో రూపొందించింది. ప్రభుత్వం ఆమోదించిన రివైజ్డ్ అంచనాల ప్రకారం ఐడీసీ, ప్రైస్ ఎస్కలేషన్ కింద రూ.2778.57 కోట్లు చెల్లించేందుకు అనుమతించింది. అంటే డీపీఆర్‌లో ప్రతిపాదించిన ప్రాజెక్టు వ్యయంలో ఐడీసీ, ఎస్కలేషన్ పేరుతో 29.29 శాతం భారం పడుతుంది. మరోవైపు ఈ ప్లాంట్ రోజుకు 8:10 గంటలు ఉత్పత్తిలో ఉండటం ద్వారా ఏటా 3,502 మిలియన్ యూనిట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని వ్యాప్కోస్ సంస్థ అంచనా వేసింది.