YCP Government not Providing Water Through Jal Jeevan Mission :జలజీవన్ మిషన్ పథకం ద్వారా ఇంటింటికి తాగునీటిని అందిస్తామని గత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ పాలకులు ప్రచారం చేసుకున్నారు. కానీ ఆచరణలో మాత్రం ఆ పథకాన్ని అమలు చేసింది లేదు. అక్కడక్కడ నామమాత్రంగా పనులు చేసి అవి పూర్తయినట్లు ఆర్భాటంగా చేశారు. ఆ పథకం ద్వారా ఒక్క చుక్క నీటిని అందించిన దాఖలాలు లేవు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 86 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మొత్తం 3 లక్షలకు పైగా జనాభా ఉన్నారు.
వైఎస్సార్సీపీ హయాంలో జలజీవన్ మిషన్ అస్తవ్యస్తం - కుళాయి ఉన్న చుక్క నీరందని పరిస్థితి (ETV Bharat) జల్ జీవన్ మిషన్ పథకానికి నిధులివ్వరు - ప్రజలకి నీళ్లు అందవు - ఇలా అయితే ఎలా జగనన్నా!
పల్లెల్లో తాగునీటి సదుపాయాన్ని మెరుగుపరిచే పేరుతో జలజీవన్ మిషన్ మొదటి దశలో భాగంగా 50 గ్రామ పంచాయితీల్లో రూ. 8.6 కోట్లతో పనులు చేపట్టారు. అందులో భాగంగా కొత్త పైపులైన్లు, ట్యాంకుల నిర్మాణం, ఇంటింటా కుళాయిల ఏర్పాటు పనులకు శ్రీకారం చుట్టారు. అయితే నేటికీ ఆ పనులు పూర్తి కాలేదు. అక్కడక్కడ కొంత మేర పనులు చేపట్టినా, ఆవి నామమాత్రంగా మిగిలిపోయాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయకపోవడంతో గుత్తేదారులు ఆ పనులను మధ్యలోనే వదిలేశారు.
ఇక రెండో దశలో విడపనకల్లు మండలంలో రూ.11.56 కోట్లు, ఉరవకొండ మండలంలో రూ.21.2 కోట్లతో జలజీవన్ మిషన్ పనులు చేపట్టారు. బొమ్మనహాళ్ మండలం బొల్లనగుడ్డం నుంచి విడపనకల్లు మండలం పాల్తూరు వరకు కొత్త పైపులైన్ నిర్మాణంతో పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో తాగునీటి ట్యాంకులు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఉరవకొండ పట్టణంలో 5 వేల కుళాయిల ఏర్పాటుతో పాటు కొత్త పైపులైన్లు, నీటి నిల్వకు పెద్ద సంపు నిర్మించేలా చర్యలు చేపట్టారు. ఆ పనులు కనీసం 25 శాతం మేర కూడా పూర్తి కాలేదు. కొన్ని కాలనీల్లో ఇంటింటా కుళాయిలు ఏర్పాటు చేసినా, వాటికి నీటిని సరఫరా చేసింది లేదు. ప్రస్తుతం అవి ఆలంకార ప్రాయంగా మారాయి.
Jal Jeevan Mission: జల్ జీవన్ మిషన్ పథకం అమలులో ఏపీ విఫలం: గజేంద్ర షెకావత్
"జలజీవన్ మిషన్ పథకం ద్వారా ఇంటింటికీ తాగునీటిని అందిస్తామని గత ఐదేళ్ల వైెఎస్సార్సీపీ పాలకులు ఊదరకొట్టారు. కానీ ఆచరణలో శూన్యం. ఎన్నికల్లో లబ్ది పొందడానికి గత ఐదేళ్లలో స్థానిక వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు ఎలాంటి పదవులు లేకపోయినా జలజీవన్ మిషన్ పనులపై ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్షలు జరిపారు. పనులను తమ సొంత నిధులతో చేపట్టినట్లు ప్రగల్భాలు పలికారు. నీటి సమస్యను తీర్చేస్తున్నామంటూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. ఇక ఇంటింటా నీళ్లు ఇచ్చేస్తున్నట్లు హడావుడి చేశారు.అయితే నేటికి చుక్కనీరు అందిన దాఖలాలు లేవు. కాలనీల్లో కుళాయిలు ఉన్న నీరు రాని పరిస్థితి. పైప్లైన్ కోసం ఉన్న రోడ్లను తవ్వి, తరువాత వాటిని పూడ్చలేదు. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది." - నిమ్మల ప్రసాద్, స్థానికుడు
Jal Jeevan Mission Project at AP: ఇంటింటికీ కుళాయి కనెక్షన్ ఇంకెప్పుడో? ..జాప్యంపై కేంద్రం అసంతృప్తి