Snow in Yadadri Temple: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో అపురూప దృశ్యం ఆవిష్కరించింది. ఆదివారం ఉదయం పొగమంచు అలుముకుంది. ఆలయ సప్త గోపురాలు, ఆలయ పరిసరాలు, మాడవీధులు పొగమంచు దుప్పటితో కనిపించాయి. ఉదయం చల్లని మంచు భక్తులను కనువిందు చేసింది. పొగమంచుతో ఉన్న ఆలయాన్ని భక్తులు ఫొటోలు, వీడియోలు తీసుకుని ఆస్వాదించారు.
Yadadri Temple Income Increased: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి కార్తీక మాసంలో భారీగా ఆదాయం సమకూరింది. కార్తీక మాసం నెల రోజులలో వివిధ రూపాల్లో 18 కోట్లకు పైగా ఆదాయం చేకూరిందని ఈవో భాస్కర్ రావు వెల్లడించారు. వ్రతాలు, దర్శనాలు, భక్తుల ద్వారా విరళాలు, కొండ పైకి వాహన ప్రవేశం తదితర రూపాల్లో 18 కోట్ల 3 లక్షల రూపాయల ఆదాయం చేకూరిందని తెలిపారు. కిందటి ఏడాదిలో 15 కోట్ల 8 లక్షలు రాగా, ఈ ఏడాది 2 కోట్ల 95 లక్షల రూపాయలు అధిక ఆదాయం వచ్చిందన్నారు. కార్తీక మాసంలో స్వామి వారి సేవలో పాల్గొనేందుకు భక్తులకు ఇబ్బందులు కలుగకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో భక్తుల తాకిడి భారీగా పెరిగిందని ఈవో భాస్కర్ రావు తెలిపారు.