Work Pressure for Chittoor Police:ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆధ్యాత్మిక కేంద్రాలు ఉండటంతో వీఐపీల తాకిడి అధికంగా ఉంటుంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, పలు రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులతో పాటు వివిధ రాష్ట్రాల సీఎంలు, మంత్రులు తరచూ తిరుమల, కాణిపాకం, శ్రీకాళహస్తి, అరగొండ ఆలయాలను సందర్శిస్తుంటారు.
కొందరు తమిళనాడులోని వేలూరు సమీపంలోని బంగారుగుడిని రోడ్డు మార్గంలో వెళ్లి దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో పోలీసు అధికారులు, సిబ్బందే విధులు నిర్వహించాల్సి ఉంటుంది. స్టేషన్ విధులతో పాటు వీఐపీలు వచ్చినప్పుడు అధికారులు, సిబ్బంది ప్రత్యేకంగా విధులు నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో కుటుంబాలకు దూరమై ఒత్తిడికి గురవుతున్నారు.
జగన్ ఉద్యోగులతో పాటు పోలీసులను దగా చేశారు: నాగబాబు - Nagababu responded on Police issues
ఆధ్యాత్మిక కేంద్రాల ఖిల్లా అయిన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పని చేయాలంటే పోలీసులకు ఓ సవాలే. సిబ్బంది గుండెపోటుకు గురై మృతి చెందడం, పలువురు రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్నారు. ప్రధాన కారణమైన విధుల్లో ఒత్తిడి నుంచి ఉపశమనం కల్పించేందుకు వారాంతపు సెలవులు ఇస్తామని, బందోబస్తు సమయంలో ప్రత్యేక భత్యాలు ఇస్తామని, న్యాయమైన పీఆర్సీ అందజేస్తామని సీఎం జగన్ జిల్లాలో నాటి పాదయాత్రలో పలుమార్లు హామీలు గుప్పించి వాటిని నెరవేర్చలేదు. ఫలితంగా విధి నిర్వహణలో ఒత్తిడి తదితర కారణాలతో సిబ్బంది ప్రాణాలు కోల్పోయి తమ కుటుంబాలకు తీరని వేదన మిగుల్చుతున్నారు.
అక్కడ ₹8 వేలకే ఐఫోన్ ! - భారీ రాకెట్‌ను ఛేదించిన పోలీసులు - stolen Cell phones
జిల్లాలో ప్రస్తుతం ఆరుగురు డీఎస్పీలు, 28 మంది సీఐలు, 50 మంది ఎస్ఐలు, 105 ఏఎస్ఐలు, 254 మంది హెడ్‌కానిస్టేబుల్, 643 మంది కానిస్టేబుల్స్ ఉన్నారు. ఇక ఆర్మ్డ్ రిజర్వులో ఒక డీఎస్పీ, ఇద్దరు ఆర్ఐలు, ఐదుగురు ఆర్‌ఐఎస్‌లు, 99 ఏఆర్‌హెచ్‌సీలు, 212 మంది ఏఆర్పీసీలు ఉన్నారు. ఇంకా బ్రిటీష్ హయాం నాటి సంఖ్యే నేటికీ సిబ్బంది విషయంలో కొనసాగుతోంది. ఉన్న సిబ్బందితోనే రాత్రి విధులు నిర్వర్తిస్తున్నారు.
గతంలో స్టేషన్ విధుల్లో ఉన్నవారు నెలకు పది రోజులు రాత్రి విధులు నిర్వహించేవారు. ప్రస్తుతం నెలలో 15 రోజులు పాటు విధిగా రాత్రి డ్యూటీలు చేయాల్సిందే. రోజు మార్చి రోజు రాత్రి విధులు నిర్వర్తించాలంటే కష్టసాధ్యమే. ఈ నేపథ్యంలో సీఎం జగన్ వారాంతపు సెలవులు ఇస్తామని ప్రకటించారు. నాటి డీజీపీ గౌతం సవాంగ్ కమిటీ వేసి వారంలో ఒక రోజు సెలవు ఇవ్వాలని ప్రతిపాదించారు. ఆ మేరకు నెల రోజులు వారాంతపు సెలవులు ఇచ్చారు. ఆపై ప్రస్తుతం ఉన్న సిబ్బందితో వారాంతపు సెలవులు ఇవ్వడం కుదరదని రద్దు చేశారు.