Wish Fulfillment Pond:ప్రతిమనిషి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అందుకే దేవుడిని పూజిస్తారు. దేవుడు తమ కష్టాలను నెరవేరుస్తారని నమ్ముతారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇలా దేవుడికి మనసులో ఉన్న కోర్కెలను చెప్పుకుంటే నెరవేరుతాయని విశ్వసిస్తారు. అలాంటి వారు ఆ ఐదు రోజుల్లో ఆ చెరువు వద్దకు వెళ్తే కోరిన కోర్కెలు నెరువేరుతాయి. ఇంతకీ ఆ ప్రాంతం ఎక్కడ? పూజా విధానం ఏంటి? వంటి వివరాలు మీకోసం.
కోర్కెలు తీర్చే చెరువు ఎక్కడుంది?:కోర్కెలు తీర్చే ఈ చెరువు నెల్లూరు జిల్లా బారాషాహీద్ దర్గా వద్ద ఉంది. దీనిని స్వర్ణాల చెరువుగా పిలుస్తారు. ఈ చెరువు వద్దకు వెళ్తే కోర్కెలు ఏమైనా నెరవేరుతాయని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో ప్రతి ఏడాది ఐదు రోజులపాటు ఈ ప్రాంతంలో ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు.
పూజా విధానం :స్వర్ణాల చెరువులో స్నానం చేసి రొట్టెలు మార్చుకోవాలి. ఒక్కో కోరికకు అనుగుణంగా ఒక్కో రకమైన రొట్టెను తీసుకోవాలి. కోర్కెలు తీరినవారు అందుకు గుర్తుగా రొట్టెలు తెచ్చి పంచుతారు. కోర్కెలు తీరిన వ్యక్తి రొట్టెను పంచుతుండగా.. అలాంటి కోరికే తీరాలనుకునే మరో వ్యక్తి ఆ రొట్టెను అందుకుంటారు. ఇలా సంపద, ఉద్యోగం, చదువు, సొంత ఇల్లు, వివాహం, ఆరోగ్యం ఎవరి కోర్కెలకు అనుగుణంగా వారు రొట్టె తీసుకుని తినాలి.