Tips in Telugu To Get Govt Jobs :తెలంగాణలో దసరా పండుగ సందడే వేరు. అమ్మవారి పూజలు, బతుకమ్మ ఆటలు, దాండియా, గర్భా నృత్యాలతో ధూంధాం ఉంటుంది. మహిషాసురునిపై దుర్గాదేవి సాధించిన విజయానికి ప్రతీకగా, రాముడు రావణుడిని ఓడించి దసరా రోజు అయోధ్యకు వచ్చాడని చెడుపై మంచి సాధించిన విజయంగా దసరా పండుగను చేసుకుంటారు. తెలుసా ఈ పండుగ నేపథ్యం ఉద్యోగాలు వేటలో ఉన్న వారికి ఓ సందేశాన్నిస్తోంది. గెలుపు తీరాలను చేరుకోకపోవడానికి ఉన్న బలహీనతలను అధిగమిస్తే విజయం సొంతం చేసుకోవచ్చని దసరా పండుగ ద్వారా అర్థం చేసుకుంటే ఓ మంచి ఉద్యోగం మీ సొంతమవుతుంది.
2024 కొలువుల నామ సంవత్సరం. ఇప్పటికే వేల మంది నిరుద్యోగులు కష్టపడి చదివి సర్కారి కొలువులు సాధించారు. కొందరైతే నాలుగైదు ఉద్యోగాలకు అర్హత కూడా సాధించారు. వచ్చే వారం నుంచి గ్రూప్స్ పరీక్షలు మొదలు కాబోతున్నాయి. అక్టోబర్ 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. నవంబరులో గ్రూప్-3, డిసెంబరులో గ్రూప్-2 పరీక్షలను టీజీపీఎస్సీ నిర్వహించబోతుంది. పోస్టులు వందల సంఖ్యలోనే ఉండగా పోటీపడుతున్న అభ్యర్థులు మాత్రం లక్షల్లో ఉన్నారు. శ్రమిస్తేనే విజయం వరిస్తుందని కష్టపడేవారికే అదృష్టం వరిస్తుందని విద్యా నిపుణులు చెబుతున్నారు.
ఫోన్ పక్కన పెట్టేసి :రోజులో చాలా సమయం సెల్‌ఫోన్‌తోనే గడుపుతున్నాం. కనీసం పది నిమిషాలకు ఒక్కసారైనా చెక్ చేస్తాం. ఏదైనా మెసేజ్, కాల్ వచ్చిందా అని చూస్తాం. అలాగే ఫోన్ పట్టుకుని కూర్చుంటాం. కానీ పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు ప్రతి నిమిషం చాలా ముఖ్యం. మొదటగా చేయాల్సిన పని దీన్ని దూరం పెట్టడం అలవాటు చేసుకోవాలి. ఇక ఆన్‌లైన్‌లో యాప్స్‌లో సన్నద్ధం అయ్యేవారు వాటి వరకే పరిమితం కావాలి. ఫోన్‌ను సైలెంట్ మోడ్‌లో పెట్టి క్లాసులు వినాలి. పొరపాటున చేతులు రీల్స్‌వైపు వెళ్లాయో కాలం ఇట్టే కరిగిపోతుంది.
పక్కా ప్లాన్ చేసుకుంటేనే :కాంపిటీటివ్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు రోజువారీ షెడ్యూల్ ప్లాన్ చేసుకోవాలి. ఆ రోజు, ఆ వారం ఏ అంశాలను పూర్తి చేయాలి అనుకుంటున్నారో వాటిని పేపర్ పైన రాసి పెట్టుకోవాలి. అలా చేయకపోతే పరీక్షల నాటికి సిలబస్ పూర్తి చేసి రివిజన్ చేయడం చాలా కష్టతరం అవుతుంది. ప్లాన్ చేసుకోవడంలో ఇబ్బందులు ఉంటే నిపుణుల అభిప్రాయాలు తీసుకుంటే హెల్ప్ అవుతుంది.
చివరి వరకు ప్రయత్నించాలి : పరీక్షల్లో నెగ్గి ఉద్యోగం సాధించాలి అంటే ఆరంభ శూరత్వం ఉండాలి. కొంతమంది ఫస్ట్‌లో బాగా చదువుతారు. కొన్ని రోజులకు డీలా పడిపోతుంటారు. పరీక్ష దగ్గరికి వచ్చేసరికి ఇంక అంతే సంగతి. అనవసరమైన విషయాలకు ఆందోళన పడుతుంటారు. తమకు సంబంధం లేనివి, దాని వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్న అంశాలను పట్టించుకోకపోవడం ఉత్తమం. పరీక్షలకు సన్నద్ధం అయ్యేవారు ఏకాగ్రతను దెబ్బతీసే అంశాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మధ్యలోనే ఆపేయకుండా చివరి వరకు ప్రయత్నించాలి.
'సాలరీ ప్యాకేజ్' గురించి డిస్కస్ చేయాలా? ఈ టాప్-10 టిప్స్ మీ కోసమే! - How To Negotiate Salary