Wife Committed Suicide Because Her Husband Died :ప్రేమతో వారిద్దరి మనసులు కలిశాయి. పెళ్లితో ఒక్కటయ్యారు. జీవితాంతం ఒకరికొకరు తోడుండాలని భావించారు. కానీ వీరి అన్యోన్యతను చూడలేకపోయిందేమో విధి. హాయిగా సాగిపోతున్న దంపతుల బంధాన్ని చిదిమేసింది. రోడ్డు ప్రమాద రూపంలో భర్తను విడదీసింది. ఈ చేదు వార్త విన్న ఆమె గుండె తట్టుకోలేకపోయింది. భర్తలేని లోకంలో నేనుండలేనంటూ తానూ ప్రాణాలు విడిచింది. ఈ హృదయ విదారక ఘటన శ్రీకాకుళం జిల్లాలోని లావేరు మండలంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే,
రోడ్డు ప్రమాదంలో భర్త మృతి : జిల్లాలోని లావేరు మండలం కేశవరాయనపాలెం గ్రామానికి చెందిన నాయిని చంటి ఎచ్చెర్ల మండలం సంతసీతారాంపురం పంచాయతీ నందిగాంకు చెందిన భవానీతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ప్రేమ అనంతరం ఏడాదిన్నర కిందట మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. భార్యభర్తలు ఇద్దరూ కోటి ఆశలతో కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు. ఎంతో అన్యోన్యంగా, ప్రేమ అనురాగాలతో మెలుగుతున్నారు. కష్టసుఖాల్లో తోడుగా ఉంటూ వారి జీవితం సాగింది. చంటి దసరా రోజున ఉదయం టిఫిన్ తీసుకొచ్చేందుకు ద్విచక్ర వాహనంపై బయలు దేరగా మురపాక సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే.
పండుగ పూట విషాదం - ఇద్దరు పిల్లలతో సహా బావిలో దూకి తండ్రి ఆత్మహత్య