ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొనసాగుతున్న ఉపరితల ద్రోణి - రాగల రెండు రోజుల్లో జల్లులు కురిసే అవకాశం - Temperatures in AP - TEMPERATURES IN AP

Weather Update and Summer Heat Waves in Andhra pradesh: రాగల రెండు రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురిసే సూచనలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరి కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే సూచనలూ ఉన్నట్టు తెలియచేసింది. నేడు అత్యధికంగా నంద్యాల జిల్లాలో 42.79 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయినట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది.

summer_heat_waves
summer_heat_waves

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 8, 2024, 3:34 PM IST

Weather Update andSummer Heat Waves in Andhra Pradesh:ఉత్తర కోస్తాంధ్ర నుంచి దక్షిణ తమిళనాడు వరకు రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడినట్టు అమరావతిలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతున్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాగల రెండు రోజుల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒకటీ రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురిసే సూచనలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది. అటు కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే సూచనలూ ఉన్నట్టు తెలియచేసింది. మరోవైపు ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు, దక్షిణ కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు దిగివచ్చాయి.

దాహం కేకలు - అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజల ఆగ్రహం - People Suffering water problems

District wise Temperatures in AP:కొన్ని ప్రాంతాల్లో చాలా చోట్ల 35-40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. ఇక రాగల రెండు రోజుల పాటు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వేడి, తేమతో కూడిన వాతావరణం కొనసాగుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమ జిల్లాల్లో అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. అత్యధికంగా నంద్యాల జిల్లాలో 42.79 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. కడప, అనంతపురం, తాడిపత్రి, పొద్దుటూరు, పాణ్యంలలో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది.

కడప జిల్లా ఒంటిమిట్ట, సూళ్లూరుపేట, గుంతకల్ ప్రాంతాల్లో 42 డిగ్రీలు సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. కర్నూలు, మంత్రాలయం, నెల్లూరు, నందికొట్కూరు, ప్రకాశంలో 41 డిగ్రీల సెల్సియస్​గా రికార్డు అయ్యింది. ఎన్టీఆర్, పల్నాడు, సత్యసాయి, అల్లూరి, అన్నమయ్య, చిత్తూరు, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 37 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఇక శ్రీకాకుళం, అనకాపల్లి బాపట్ల, విజయనగరం జిల్లాల్లో 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

ఎండాకాలంలో రోజుకు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే? - how much water to drink in Summer

విద్యుత్తు సరఫరా అంతంత మాత్రంగానే:ప్రజలు ఎండలో బయటకు వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వడగాడ్పులు తీవ్ర ప్రభావం ఉన్న ప్రాంతాల్లో సెల్​ఫోన్లకు హెచ్చరికల సందేశాలు పంపాలని నిర్ణయించారు. అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులపై ఎప్పటికప్పుడు స్టేట్ ఏమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి పర్యవేక్షణ చేయనున్నట్టు అధికారులు తెలిపారు. గత ఏడాదిలోనూ గరిష్ఠంగా 48.6 డిగ్రీల మేర అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన దాఖలాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఎండ తీవ్రత వల్ల సుదూర ప్రయాణాలు చేయకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. మండుతున్న ఎండలకు తోడు పలు చోట్ల విద్యుత్తు సరఫరా కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో జనం ఉక్కపోతకు గురవుతున్నారు. ప్రతి ఒక్కరు ఎండలో తిరగకుండా తగు ఆరోగ్య సూత్రాలు పాటించాలని సూచిస్తున్నారు.

మండుతున్న ఎండలు - మరింత పెరిగే అవకాశం - summer heat in andhra pradesh

ABOUT THE AUTHOR

...view details