Water Release from Prakasam Barrage :ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ప్రకాశం బ్యారేజికి ఎగువ నుంచి 84,297 క్యూసెక్కుల నీరు వస్తుంది. ఎగువన పులిచింతల నుంచి 1,36,577 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేసారు. ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్టులో 44.18 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కృష్ణా డెల్టా తూర్పు కాలువలకు 4,028 క్యూసెక్కుల నీరు, కృష్ణా డెల్టా పశ్చిమ కాలువలకు 2,519 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.
మిగిలిన 77,750 క్యూసెక్కుల నీటిని అధికారులు గేట్ల ద్వారా సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. బ్యారేజీలో 12 అడుగుల నీటిమట్టం ఉంది. బ్యారేజీలో 3.07 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 40 గేట్లను 2 అడుగుల మేర, 30 గేట్లను 1 అడుగు మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పటి వరకూ ప్రకాశం బ్యారేజి నుంచి 739 టీఏంసీల మేర నీటిని సముద్రంలోకి విడుదల చేసారు.
పరవళ్లు తొక్కుతోన్న కృష్ణమ్మ : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. నీటి ప్రవాహం పెరగడంతో శ్రీశైలం ప్రాజెక్టు (Srisailam project) 4 గేట్లు ఎత్తి 1.11 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు 1.90 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 884.90 అడుగులకు చేరింది.