CM Revanth vs BRS KTR : వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధుల కేటాయింపుపై తీవ్రంగా చర్చ సాగుతోంది. రాష్ట్రానికి కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం జరిగిందని అసెంబ్లీలో ముక్తకంఠంతో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. ముఖ్యంగా సీఎం రేవంత్‌రెడ్డి, కేటీఆర్ మధ్య కాసేపు మాటల యుద్ధం నడిచింది.
కేటీఆర్‌పై సీఎం రేవంత్ గరం.. కేంద్ర బడ్జెట్లో నిధుల కేటాయింపుపై సీఎం రేవంత్ మాట్లాడుతూ, కేటీఆర్ అవగాహనారాహిత్యంతో సభను తప్పుదోవ పట్టిస్తున్నారని, కీలకమైన చర్చ జరుగుతున్నప్పుడు కేసీఆర్ ఎందుకు రాలేదని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ "మాకు జవాబు చెప్పండి చాలు, మీకు కేసీఆర్ అక్కర్లేదు" అని అనడంతో రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతరం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, తండ్రి పేరు చెప్పుకొని తాను మంత్రిని కాలేదని, కింది స్థాయి నుంచి ఎదిగి ముఖ్యమంత్రిని అయ్యానన్నారు. కేటీఆర్‌ది మేనేజ్‌మెంట్ కోటా అనుకున్నానని, అంతకంటే దారుణమని ఆయన ఎద్దేవా చేశారు. ఆ వెంటనే కేటీఆర్ స్పందిస్తూ, రేవంత్ రెడ్డి పేమెంట్ కోటాలో సీఎం అయ్యారని మేమూ అనొచ్చునని బదులిచ్చారు. దీనికి రేవంత్ రెడ్డి మళ్లీ కౌంటర్ ఇస్తూ, పేమెంట్ కోటాలో సీఎంను కాలేదని, మొన్న బీఆర్ఎస్ నేతలు దిల్లీ వెళ్లి చీకట్లో మాట్లాడుకొని వచ్చారని ఆరోపించారు.
మేం ఏం మాట్లాడాలో కూడా మీరే చెబితే ఎట్లా.. కేటీఆర్ స్పందిస్తూ ‘మేనేజ్‌మెంట్ కోటాలో మంత్రి అయ్యానని సీఎం అనొచ్చా? సభా నాయకుడు అలా మాట్లాడొచ్చా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో చాలా సాధించామని కేటీఆర్ తెలిపారు. దిల్లీతత్వం ఇంతకాలానికి కాంగ్రెస్‌కు బోధపడిందని పేర్కొన్నారు. తెలంగాణ హక్కులు ఎవరు హరించినా వారి మెడలు వంచుతామన్నారు. విభజన సమయంలో తెలంగాణ హక్కుల కోసం ఎంతో పోరాడామని, మోదీ సర్కారుపై తెలంగాణ కోసం అనేక పోరాటాలు చేసినట్లు వ్యాఖ్యానించారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే మీకేం ఇబ్బందని కేటీఆర్ ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి కష్టపడే ఈ స్థాయికి చేరుకున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి చిన్న వయస్సులోనే సీఎం అయ్యారని, చిన్న వయస్సులోనే సీఎం అయినందుకు రేవంత్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. తాము ఏం మాట్లాడాలో కూడా మీరే చెబితే ఎట్లా అని ప్రశ్నించారు. శాసించి సాధించుకోవాలని, యాచిస్తే ఏమీ రాదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కేంద్రం వివక్షను ఎండగట్టడంలో తాము సహకరిస్తామని కేటీఆర్ తెలిపారు. కేంద్రం సాయం చేయకపోయినా ఎంతో అభివృద్ధి చేశామన్నారు.
శాసనసభలో ఆర్టీసీపై వాడివేడి చర్చ - ఇంతకీ ప్రభుత్వంలో సంస్థ విలీనం ఉన్నట్టా లేనట్టా? - DEBATE ON TGRTC MERGE IN GOVT
ఈ దేశంలో తెలంగాణ భాగం కాదా? - మాపై ఎందుకీ సవతి ప్రేమ? : మంత్రి శ్రీధర్‌బాబు - UNION BUDGET DEBATE IN TG ASSEMBLY