టీడీపీలోకి 40 మంది వాలంటీర్లు - చంద్రబాబుపై నమ్మకంతోనే చేరామని వెల్లడి Volunteers Joined TDP in Nellore District: నెల్లూరు జిల్లాలో వాలంటీర్లు టీడీపీలోకి చేరిక ప్రారంభం అయ్యింది. ప్రభుత్వం మీద భయంతో టీడీపీలోకి రాలేక ఒత్తిడితో ఉన్న యువతీ యువకులు ఈ రోజు ఒక్కసారిగా 40 మంది తెలుగుదేశంలోకి చేరడం పార్టీకి బలంగా మారింది. వైసీపీ నాయకుల భయంతో వాలంటీర్లు టీడీపీలోకి ఇప్పటి వరకు వచ్చేందుకు ధైర్యం చేయలేదని చెబుతున్నారు. ఈ రోజు కోవూరు నియోజకవర్గంలో భారీగా వాలంటీర్లు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సమక్షంలో చేరారు.
రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ ఆదేశాలతో వాలంటీర్లు నడుస్తున్నారు. దీంతో ఇప్పటి వరకూ ఉద్యోగ భద్రత కోసం బయటకు వచ్చే సాహసం చేయలేదు. ఈ రోజు కోవూరు నియోజకవర్గం విడవలూరు మండలం నుంచి 40 మంది యువతీ యువకులు వాలంటీర్లుగా రాజీనామా చేశారు. అనంతరం వేమిరెడ్డి ఇంటికి వచ్చారు.
'కూటమి మ్యానిఫెస్టోతో వైసీపీకి డిపాజిట్లు కూడా రావు- వాలంటీర్ల వేతనం రెట్టింపు చేస్తాం' - Chandrababu in Ugadi celebration
వాలంటీర్లు అంతా ఉత్సాహంగా రావడంతో వేమిరెడ్డి దంపతులు వారిని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. వాలంటీర్లు టీడీపీలోకి వచ్చి చేరడం నెల్లూరు జిల్లాలో ఇది మొదటి సారి అనే చెప్పాలి. అయితే వీరు మాత్రమే కాకుండా మరికొంతమంది వచ్చే రెండు రోజుల్లో చేరే అవకాశం ఉంది. దీంతో వేమిరెడ్డి దంపతులు వాలంటీర్లకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతో టీడీపీలో చేరామని వాలంటీర్లు ప్రకటన చేశారు.
కూటమి అధికారంలోకి వస్తుందని, 10 వేల రూపాయల జీతం వస్తుందన్న భరోసాతోనే వాలంటీర్లంతా తెలుగుదేశం పార్టీలో చేరారని ప్రశాంతి రెడ్డి తెలిపారు. టీడీపీపై నమ్మకంతో చేరినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుత ఎమ్మెల్యే మహిళా వాలంటీర్లకు గౌరవం ఇవ్వడం లేదని ప్రశాంతిరెడ్డి ఆరోపించారు. ఒక మహిళను ఓడించలేక వైసీపీ నేతలు అనసవర విమర్శలకు దిగుతున్నారని, ఓట్లు అడిగే ముందు నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలని ప్రశాంతి రెడ్డి డిమాండ్ చేశారు.
సలహాదార్లకు లక్షల్లో- పనిచేసేవారికి రూ.5వేలా! జగన్ వాడకాన్ని వాలటీర్లు గుర్తించాలి: నాదెండ్ల మనోహార్ - Janasena leader Nadendla Manohar
చంద్రబాబు హామీతో వాలంటీర్లకు ధైర్యం:కాగాఇటీవల గ్రామ, వార్డు వాలంటీర్లకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీపి కబురు చెప్పిన విషయం తెలిసిందే. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాలంటీర్లను తొలగించబోమని మరోసారి స్పష్టం చేస్తూనే, వారికి ఇప్పుడిస్తున్న 5 వేల గౌరవ వేతనాన్ని 10 వేల రూపాయలకు పెంచుతామని ప్రకటించారు. అంతే కాకుండా వాలంటీర్లలో నైపుణ్యాలు పెంచి, ఇంటి వద్దే ఉంటూ 50 వేల రూపాయల నుంచి లక్ష వరకు సంపాదించుకునేలా తీర్చిదిద్దుతామని చంద్రబాబు ప్రకటించారు.
దీంతో చంద్రబాబు ప్రకటనతో అనేక మంది వాలంటీర్లు టీడీపీలోకి వచ్చేందుకు సిద్ధపడుతున్నారు. ఇన్నాళ్లూ వైసీపీ నేతలు, ప్రభుత్వంపై భయంలో ఉన్న వాలంటీర్లు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. తాజాగా నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో 40 మంది వాలంటీర్లు టీడీపీలో చేరారు.
'మేం రాజీనామా చేయం'- వైఎస్సార్సీపీ నేతలకు వాలంటీర్ల షాక్ - Volunteers Resignation in AP