ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

న్యూ ఇయర్ 2025​ వేడుకలకు వేళైంది - కానీ షరతులున్నాయి - NEW YEAR CELEBRATIONS INSTRUCTIONS

నూతన సంవత్సరం సందర్భంగా మార్గదర్శకాలు జారీ చేసిన విశాఖ సీపీ శంఖ బ్రత బాగ్చి

Visakha CP Shanka Brata Bagchi Instructions for New Year Celebrations 2025
Visakha CP Shanka Brata Bagchi Instructions for New Year Celebrations 2025 (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 26, 2024, 9:52 PM IST

Visakha CP Shanka Brata Bagchi Instructions for New Year Celebrations 2025 : నూతన సంవత్సరం వేడుకలకు యువత ముందుగానే ప్లాన్స్​ చేసుకుంటుంటారు. ఎలా జరుపుకోవాలి? ఎక్కడికి వెళ్లాలి? అంటూ పెద్ద జాబితా సిద్ధం చేసుకుంటుంచారు. న్యూ ఇయర్ వస్తుందంటే యువతే కాదు వయస్సుతో సంబంధం లేకుండా అందరికీ వారి వారి ప్లానింగ్స్‌ ఉంటాయి. కొంతమంది కుటుంబ సభ్యులతో, మరికొందరు స్నేహితులతో, కొందరు ఇంట్లో సెలబ్రేట్‌ చేసుకోవాలని నిర్ణయం తీసుకుంటారు. ముఖ్యంగా ఈవెంట్స్‌కి వెళ్లి, హాయిగా కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించాలని అనుకునే వారు చాలా ఉంటారు. ఈ నేపథ్యంలో పోలీసులు మార్గదర్శకాలు జారీ చేశారు.

Conditions for New Year Celebration 2025 : కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో హోటల్స్‌, క్లబ్స్‌, పబ్‌ల నిర్వహణకు సంబంధించి విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి మార్గదర్శకాలు జారీ చేశారు. డిసెంబర్‌ 31 నుంచి వచ్చే సంవత్సరం జనవరి 1 వరకు మార్గదర్శకాలు అమల్లో ఉంటాయని వెల్లడించారు.

విశాఖ సీపీ శంఖ బ్రత బాగ్చి జారీ చేసిన మార్గదర్శకాలు : -

  • హోటళ్లు, క్లబ్‌లు, పబ్‌ల నిర్వహణకు రాత్రి ఒంటి గంట వరకే అనుమతి.
  • ఈవెంట్లు నిర్వహించాలంటే ముందుగా దరఖాస్తు చేసుకోవాలి.
  • ఏపీ పబ్లిక్ సేఫ్టీ ఎన్‌ఫోర్స్‌మెంట్ యాక్ట్-2013 (AP Public Safety Enforcement Act-2013) ప్రకారం అన్ని ప్రవేశ, ఎగ్జిట్‌ పాయింట్లలో రికార్డింగ్ సౌకర్యం ఉన్న సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.
  • వాహనాల పార్కింగ్ ప్రదేశాల్లోనూ రికార్డింగ్ సౌకర్యం ఉన్న సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.
  • విశాఖపట్నంలోని నొవాటెల్ హోటల్ జంక్షన్, ఆర్‌కే బీచ్‌ (RK Beach), భీమిలి, గాజువాక, పెందుర్తి పరిసరాల్లో 'షీ టీమ్స్‌ (She Teams)' అందుబాటులో ఉంటాయి.
  • మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా వెంటనే సంప్రదించాలి.
  • ఈవెంట్‌కు సంబంధించి కళాకారులు ధరించే దుస్తులు, చేసే నృత్యాలు, చర్యలు, మాటలు అన్నీ సముచితమైన దృక్పథంతో ఉండాలి. ఎలాంటి అశ్లీలత ఉండొద్దు.
  • ఈవెంట్లలో అశ్లీలత, నిర్ణీత స్థాయి మించి శబ్ధస్థాయి ఉండకూడదు.

పైన పేర్కొన్న మార్గదర్శకాలను హోటళ్లు, క్లబ్‌లు, పబ్‌ల నిర్వహకులు కచ్చితంగా పాటించాలని శంఖ బ్రత బాగ్చి ఆదేశించారు.

న్యూఇయర్​ వేడుకలకు ఫిల్మ్​సిటీ స్వాగతం - ఇక సందడే సందడి

ఈ న్యూఇయర్​లో మంచి రీఛార్జ్ ప్లాన్​ కోసం చూస్తున్నారా?- రూ.500లోపు బెస్ట్ ప్యాక్స్ ఇవే..!

ABOUT THE AUTHOR

...view details