Vijayawada Kanaka Durga Temple Hundi Income: శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను మల్లికార్జున మహామండపం ఆరో అంతస్తులో గురువారం లెక్కించారు. కానుకలను లెక్కించగా 2 కోట్ల 28 లక్షల 81 వేల 128 రూపాయల ఆదాయం వచ్చింది. కానుకలతోపాటు 328 గ్రాముల బంగారం, 3.480 కిలోల వెండి వస్తువులను మొక్కుల రూపంలో చెల్లించుకున్నారు.
విదేశీ కరెన్సీ 158 అమెరికన్, 115 కెనడా డాలర్లు, 65 ఇంగ్లాండ్ పౌండ్లు, 30 కువైట్ దీనార్లు భక్తులు హుండీల్లో సమర్పించారు. దీనితో పాటు ఆన్లైన్లో రూ.78,333 ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. కానుకల లెక్కింపును దేవాదాయ శాఖ కమిషనర్, ఈవో రామచంద్రమోహన్, డిప్యూటీ ఈవో రత్నంరాజు పర్యవేక్షించారు.