Villagers Saved The Cow That Fell Into The Well :మేత కోసం చేనుకొచ్చిన ఓ ఆవు ప్రమాదవశాత్తు పాత బావిలో పడిపోయి నరకం చూసింది. అందులో నుంచి బయటకు వచ్చేందుకు దాదాపు ఆరు గంటలు ప్రయత్నించింది. బావి ఇరుకుగా ఉండటంతో ఆవు బయటకు వచ్చేందుకు ఎంత ప్రయత్నించినా ఏ మాత్రం వీలు కాలేదు. అయినా వెనక్కి తగ్గలేదు పోరాటాన్ని ఆపలేదు. తన శక్తినంతా కూడగట్టుకుని ప్రతి క్షణం పోరాడింది. ఆ పట్టుసడలని పోరాట పటిమే ఆ మూగజీవి ప్రాణాన్ని నిలిపింది.
చిత్తూరు జిల్లా చౌడేపల్లే మండలం దిగువపల్లె పంచాయతీ అప్పినేపల్లె శివార్లలో ఒకచోట పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగాయి. అక్కడ గుంతలు. వాటివల్ల అక్కడ గుంతలు, రాళ్లు ఏం ఉన్నా కనిపించడం లేదు. వాటి మధ్యలో ఓ పాత బావి ఉంది. అదే గ్రామంలో ఉంటున్న చంద్రా అనే వ్యక్తికి చెందిన పాడి ఆవు అటువైపు మేతకు వెళ్లింది. మేత మేస్తుండగా, ఒక్కసారిగా దాని వెనుక కాళ్లు నూతిలో జారగా అది కూడా అందులో పడిపోయింది.