PROTEST AGAINST SAND MINING: ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం కాసరబాద గ్రామంలో ఇసుక మైనింగ్ నిలుపుదల చేయాలని కోరుతూ గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. గ్రామ పరిధిలోని కృష్ణా నది నుంచి పెద్ద ఎత్తున ఇసుక టిప్పర్ల ద్వారా రవాణా జరుగుతోందని అన్నారు. పరిమితికి మించిన సామర్థ్యంతో ఇసుక లోడింగ్ చేసి టిప్పర్లు తిరుగుతున్నాయని ఆరోపించారు.
'మా గ్రామంలో ఇసుక రీచ్లు వద్దు' - వాహనాలకు అడ్డంగా బైఠాయించిన గ్రామస్థులు - PROTEST AGAINST SAND MINING
ఇసుక మైనింగ్ నిలుపుదల చేయాలని కోరుతూ గ్రామస్థుల ఆందోళన
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 26, 2024, 6:44 PM IST
దీని కారణంగా ఇసుక టిప్పర్ ఢీకొని గ్రామానికి చెందిన నంద్యాల రామిరెడ్డి(46)కి తీవ్ర గాయాలు అయ్యాయని తెలిపారు. టిప్పర్ కిందకి ద్విచక్ర వాహనం దూసుకెళ్లిందని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో రామిరెడ్డికి తీవ్ర గాయాలు కాగా, నందిగామ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. దీంతో గ్రామస్థులందరూ ఇసుక టిప్పర్లకు అడ్డంగా బైఠాయించి తమ నిరసన తెలిపారు. తమ గ్రామంలో ఇసుక రీచ్లు వద్దంటూ ఆందోళన చేపట్టారు.
ప్రభుత్వం అవకాశమిచ్చినా సహకరమేదీ? - అధికారుల వైఖరితో ఇసుక కష్టాలు