ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రామాయపట్నం పోర్టు నిర్వాసితుల ఆందోళన- ప్రభుత్వం దిగొచ్చేవరకూ ఆందోళన తప్పదని హెచ్చరిక - Rehabilitation Package

Ramayapatnam Port Villagers Concerns: పునరావాసం కల్పించి ఆదుకోవాలంటూ రామాయపట్నం నిర్వాసితులు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. అన్నిరకాల సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చి భూములు, చేపల చెరువులు తీసుకున్న ప్రభుత్వం, ఇప్పుడు తమ గోడు పట్టించుకోవడం లేదని నిర్వాసితులు వాపోయారు. 5 రోజులుగా దీక్షలు చేస్తుంటే ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన చెందారు. ప్రభుత్వం దిగొచ్చి న్యాయం చేసేవరకు ఆందోళన ఆపేది లేదని స్పష్టం చేశారు.

Ramayapatnam Port Villagers Concerns
Ramayapatnam Port Villagers Concerns

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 9, 2024, 7:27 PM IST

రామాయపట్నం పోర్టు నిర్వాసితుల ఆందోళన- ప్రభుత్వం దిగొచ్చేవరకూ ఆందోళన తప్పదని హెచ్చరిక

Ramayapatnam Port Villagers Concerns:పునరావాసం కల్పించాలంటూ 5రోజులుగా రామాయపట్నం పోర్టు నిర్వాసితులు నిరసన బాట పట్టారు. హామీ ఇచ్చి రెండేళ్లు దాటిపోయినా ప్రభుత్వం తమ గోడును పట్టించుకోవడం లేదని వాపోయారు. అన్నిరకాల సౌకర్యాలు కల్పిస్తామంటూ భూములు, చేపల చెరువులను తీసుకుని, ఇప్పుడు తమని రోడ్డున పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ సర్కార్‌ సమస్యలను పరిష్కరించకుంటే వచ్చే ఎన్నికల్లో ఓటుతో తగిన సమాధానం చెబుతామని హెచ్చరించారు.

ఐదు రోజులుగా దీక్షలు: సమస్యలు పరిష్కరించాలంటూ రామాయపట్నం నిర్వాసితులు చేపట్టిన ఆందోళన ఐదో రోజు కొనసాగింది. 5 రోజులుగా పునరావాస ప్యాకేజీ కోసం కర్లపాలెం గ్రామస్థులు ధర్నా చేస్తున్నారు. రెండేళ్లుగా పునరావాసం కల్పించకుండా ఆర్ అండ్‌ ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండా, తమకు జగన్‌ సర్కార్‌ నరకం చూపిస్తోందని వాపోయారు. పంచాయతీలోని మిగిలిన రెండు గ్రామాలకు స్థలాలిచ్చి తమకు మాత్రం ఇప్పటివరకు ఇవ్వలేదని వాపోయారు. ప్రభుత్వం దిగొచ్చి న్యాయం చేసేవరకు ఆందోళన ఆపేది లేదని స్పష్టం చేశారు. గతంలో ఒక్కో కుటుంబానికి ప్యాకేజీ కింద 9 లక్షల 91 వేల రూపాయలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 450 కుటుంబాలకు సుమారు 44 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది. రెండేళ్లుకావస్తున్నందున అదనంగా 30శాతం పెంచి పరిహారం ఇవ్వాలని నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు. ఐదు రోజులుగా దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, దీక్షా శిబిరం వద్దనే వంటావార్పు చేస్తున్న మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆగస్టులో రామయ్యపట్నం పోర్టుకు టెండర్లు

మద్దతు తెలిపిన ఎమ్మెల్యే: ఇప్పటికే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి ఆందోళన చేస్తున్న గ్రామస్థులకు సంఘీభావం తెలిపారు. పోర్టు వద్దకు వెళ్లిన మహీధర్ రెడ్డి నిర్వాసితులను కలిశారు. పునరావాసం కల్పించకుండా పోర్టు పనులు ఎలా చేస్తున్నారని సంబంధిత అధికారులను ప్రశ్నించారు. అధికారుల తీరుపై మండిపడ్డ మహీధర్ రెడ్డి పోర్టు కార్యాలయానికి తాళాలు వేయించారు. అనంతరం ఎండీ ప్రతాప్ కుమార్ రెడ్డితో నిర్వాసితుల ప్యాక్యేజీ గురించి ఫోన్ మాట్లాడారు. నిర్వాసితులకు ప్యాకేజీ ఇవ్వకుంటే పనులను అడ్డుకుంటామని తేల్చి చెప్పారు.

రామయ్యపట్నం పోర్టును ప్రకాశం జిల్లాలోనే ఉంచాలి: విద్యార్థి జేఏసీ

'పోర్టు ప్రధాన ద్వారం వద్ద ధర్నా నిర్వహిస్తున్నాం. అయినా ప్రభుత్వం స్పందించడం లేదు. 2024 సంవత్సరానికి 18 సంవత్సరాల నుండి వారికి కూడా పరిగణలోకి తీసుకొని పరిహారం ఇవ్వాలి. ఆర్ఎస్ఆర్ ప్యాకేజీ వెంటనే అమలు చేయాలి. అంతేకాకుండా, గత ఐదు సంవత్సరాలుగా ప్రతి కుటుంబానికి ఖాళీగా ఉన్నారు. ఖాళీగా ఉన్న వారికి ప్రభుత్వమే బత్యం చెల్లించాలి. రోజుకు కనీసం 700 రూపాయలు దినసరి బత్యం ఇవ్వాలి. తాము వేటకు వెళ్లడానికి సముద్ర తీరంలో జడ్పీ ఏర్పాటు చేయాలి. పోర్టు వల్ల నష్టపోయిన ప్రతి ఇంటికి ఉద్యోగం ఇవ్వాలి. 2021 సంవత్సరం ప్రకారం ఆర్ అండ్ ఆర్ స్థలము కేటాయించి ప్యాకేజీ ఇవ్వలేదు. పొలం డబ్బులు కూడా ఇంతవరకు ఇవ్వలేదు. పోర్టు పనుల వలన వేటకు వెళ్లలేకపోయాం.'- పోర్టు నిర్వాసితులు

ABOUT THE AUTHOR

...view details