Vikrant Reddy Anticipatory Bail Petition in High Court: వైఎస్సార్సీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారారెడ్డి కుమారుడు వైవీ విక్రాంత్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కాకినాడ సెజ్, పోర్టు లాక్కొన్నారన్న కేసులో ఏ1గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్‌రెడ్డి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ పిటీషన్ దాఖలు చేయగా దానిపై హైకోర్టు విచారణ చేపట్టింది. పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలని విక్రాంత్‌రెడ్డి న్యాయవాది కోరగా విక్రాంత్‌రెడ్డి అభ్యర్థనను తిరస్కరించిన న్యాయస్థానం తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. పూర్తి వివరాలు తమ ముందు ఉంచాలని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారంలో విక్రాంత్ రెడ్డికి సంబంధం లేదని పిటిషన్ర్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. దీంతో తదుపరి విచారణను ధర్మాసనం వాయిదా వేసింది.
బెదిరించి ఆస్తులు రాయించుకున్నారు:తమతో పాటు తమ కుటుంబసభ్యులపైనా అక్రమ కేసులు పెడతామని, అరెస్టు చేసి జైలుకు పంపిస్తామని, తమ వ్యాపారాల్ని మూయించేస్తామని బెదిరించి ఆస్తులు రాయించుకున్నారని బాధితుడు కర్నాటి వెంకటేశ్వరరావు (కేవీ రావు) సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన సీఐడీ జగన్మోహన్రెడ్డికి వరుసకు సోదరుడైన వై.విక్రాంత్‌రెడ్డి, వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి, ఆయన అల్లుడి సోదరుడు, అరబిందో సంస్థ ప్రతినిధి పి.శరత్‌చంద్రారెడ్డి, పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పీ ఆడిట్ సంస్థలు, అరబిందో రియాల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, దాని డైరెక్టర్లు, ఇతరులను ఈ కేసులో నిందితులుగా చేర్చింది. ఈ క్రమంలో కేవీరావు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సీఐడీ విక్రాంత్ రెడ్డిని ఏ1గా ఎఫ్ఐఆర్లో చేర్చింది.
విశాఖ భవిష్యత్ నాలెడ్జ్ హబ్ - అధిక జనాభా మన ఆస్తి: సీఎం చంద్రబాబు