ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సంక్రాంతి సందడి - కిక్కిరిసిన విజయవాడ బస్టాండ్​ - SANKRANTHI RUSH IN VIJAYAWADA

సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో రద్దీగా మారిన విజయవాడ - అదనంగా 148 బస్సులను నడుపుతున్నా తగ్గని ప్రయాణికుల తాకిడి

SANKRANTHI RUSH IN VIJAYAWADA
SANKRANTHI RUSH IN VIJAYAWADA (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : 6 hours ago

Updated : 3 hours ago

SANKRANTHI RUSH IN VIJAYAWADA:సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ నెహ్రు బస్టాండు కిక్కిరిసిపోతోంది. ఆయా ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో బస్టాండు ప్రాంగణమంతా రద్దీగా మారింది. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో కుటుంబ సమేతంగా చాలా మంది సొంతూళ్లకు పయనమయ్యారు. దాంతో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకున్న ఆర్టీసీ అధికారులు అదనంగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు.

సంక్రాంతికిప్రత్యేక బస్సులు, రైళ్లు: కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రకు వెళ్లేవారు ఎక్కువగా ఉండటంతో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఇవాళ విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు వెళ్లేందుకు అదనంగా 148 ఆర్టీసీ బస్సులను సిద్ధం చేశారు. బస్సు రావడమే ఆలస్యం బస్సు ఎక్కేందుకు ప్రయాణికులు ఎగబడుతున్నారు. ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలనే వసూలు చేస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరుతో పాటు పలు ప్రాంతాల నుంచి వచ్చేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. అందుకుగాను ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైల్వే శాఖ అదనంగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది.

సంక్రాంతి సందడి - కిక్కిరిసిన విజయవాడ బస్టాండ్​ (ETV Bharat)

ప్రయాణికులకు ఏపీఎస్​ఆర్టీసీ బంపర్ ఆఫర్ - ఆ బస్సుల్లో ఛార్జీలు తగ్గింపు

అదనంగా 148 బస్సులు: విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు 148 అదనపు బస్సులను ఏర్పాటు చేసి ప్రయాణికులకు సేవలందిస్తున్నారు. ప్రత్యేక బస్సుల్లో సాధారణ చార్జీలనే వసూలు చేస్తుండటంతో ప్రయాణికులు పెద్దఎత్తున ప్రయాణాలు చేస్తున్నారు. దీంతో ఆర్టీసీ ఏర్పాటు చేసిన బస్సులు ఎంతకూ సరిపోవడం లేదు. రద్దీ పెరిగితే అప్పటికప్పుడు అదనంగా బస్సులు సిద్దం చేసి పంపుతున్నారు. దీనికోసం ఎక్కువ సమయం వేచి చూడాల్సి రావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

పలువురు రైల్వే స్టేషన్లకు వెళ్తున్నారు. రద్దీ దృష్ట్యా పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ ఏర్పాటు చేసినప్పటికీ అధిక రద్దీ కారణంగా అవి సరిపోక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తే మూడింతలు చార్జీని వసూలు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకు ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

''చదువుకున్నవారు అయితే చాలా మంది మొబైల్ ఫోన్ల ద్వారా రిజర్వేషన్ చేసుకుంటారు. కానీ మిగిలిన చదువుకోని వారు, రోజూవారి పనులు చేసుకునే బతికేవారి పరిస్థితిని కూడా ఆర్టీసీ అధికారులు అర్థం చేసుకోవాలి. మహిళలు, పిల్లలను దృష్టిలో ఉంచుకుని మరికొన్ని బస్సులను అదనంగా ఏర్పాటు చేస్తే బాగుంటుంది'' - ప్రయాణికులు

సంక్రాతి ఎఫెక్ట్ : ఆర్టీసీ బస్సుల్లో దొరకని సీట్లు! - దోచేస్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌

వాహనదారులకు టోల్​ మోత - రోజులో ఎన్నిసార్లు తిరిగితే అన్నిసార్లూ కట్టాల్సిందే

Last Updated : 3 hours ago

ABOUT THE AUTHOR

...view details