ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇళ్లను కమర్షియల్ ప్లాట్లుగా ఏమార్చి- తిరుపతిలో టీడీఆర్ బాండ్లను కట్టబెట్టారు - TIRUPATI TDR BONDS SCAM PROBE

టీడీఆర్‌ బాండ్ల పేరిట భారీ దోపిడీ-వైఎస్సార్సీపీ హయాంలో అక్రమాలపై విజిలెన్స్‌ విచారణ

vigilance_intensifies_tirupati_tdr_bonds_scam_probe
vigilance_intensifies_tirupati_tdr_bonds_scam_probe (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 4, 2025, 12:49 PM IST

Vigilance Intensifies Tirupati TDR Bonds Scam Probe : తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో మాస్టర్‌ ప్లాన్‌ రహదారుల పేరిట ఆనాటి వైఎస్సార్సీపీ నేతలు అక్రమాలకు పాల్పడినట్లు విజిలెన్స్‌ విభాగం ప్రాథమికంగా గుర్తించింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి అధికార పార్టీ నేతలు టీడీఆర్‌ బాండ్లు తమకు ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా, అస్మదీయులకు కట్టబెట్టడం ద్వారా కార్పొరేషన్‌ ఖజానాకు రూ.150 కోట్ల నష్టం జరిగినట్లు విజిలెన్స్​ విభాగం తేల్చింది. ఈ నివేదిక త్వరలోనే ప్రభుత్వానికి అందనుంది.

Tirupati Ex MLA in TDR Bonds Scam :ఈ వ్యవహారం తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, అతని కుమారుడు, నాటి డిప్యూటీ మేయర్‌ అభినయ్‌రెడ్డి నడిపినట్లు ప్రాథమిక ఆరోపణలున్నాయి. తిరుపతిలో 104 మాస్టర్‌ప్లాన్‌ రహదారులు నిర్మించాలని ప్రతిపాదించిన నాటి పాలకులు 2024 ఎన్నికలకు ముందు 23 రోడ్ల పనులను హాడావిడిగా చేపట్టారు. దీనికోసం 1,389 ఆస్తులను సేకరించారు. 1,149 ఆస్తులే టీడీఆర్‌ బాండ్ల జారీకి అర్హమైనవి కాగా, అప్పట్లోనే 442 బాండ్లు ఇచ్చేశారు. మరో 707 బాండ్లను పెండింగ్ లో పెట్టారు.

తిరుపతి టీడీఆర్‌ బాండ్ల స్కాంపై చర్యలకు సిద్దమవుతున్న ప్రభుత్వం - Tirupati TDR Bond Irregularities

ఈ బాండ్ల జారీలో స్వప్రయోజనాలతో పాటు అనుచరులకు అనుచిత లబ్ధి చేకూరేలా కరుణాకరరెడ్డి, అభినయ్‌రెడ్డి తమ వ్యవహరించారన్న అభియోలు ఉన్నాయి. భూమి, ఆస్తిని నివాసిత ప్రాంతం (Residential Area)లో కోల్పోగా, వాణిజ్య ప్రాంతం (Commercial) లో కోల్పోయినట్లు తప్పుడు రికార్డులు రాయించినట్లు తేలింది. కార్పొరేషన్‌ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే వైఎస్సార్సీపీ (YSRCP) నేతల ఒత్తిడి మేరకు బాండ్లు జారీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

దీనిపై విజిలెన్స్‌ అధికారులు సర్వేయర్లతో క్షేత్రస్థాయిలో పరిశీలన చేయించి, ఆస్తుల విలువను లెక్కగట్టారు. మొత్తం రూ.850 కోట్ల విలువైన 442 టీడీఆర్‌ బాండ్లను జారీ చేయగా, వీటి వాస్తవిక విలువ రూ.700 కోట్లేనని విజిలెన్స్‌ పరిశీలనలో తేలింది. ఖజానాకు రూ.150 కోట్ల మేరకు నష్టం చేస్తున్నట్లు సమాచారం. భూముల విలువ పెంచడంపై సబ్‌రిజిస్ట్రార్లను వివరణ కోరినట్లు తెలుస్తోంది. తిరుపతి కార్పొరేషన్‌ (Tirupati Corporation) సైతం ఈ వ్యవహారంపై సమాంతరంగా విచారణ జరుపుతోంది.

టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ - సీఐడీ దర్యాప్తునకు యోచన - TDR Bonds Scam in AP

ABOUT THE AUTHOR

...view details