ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెద్దిరెడ్డి భూ ఆక్రమణపై బాధితుల ఆందోళన - LAND GRABBING VICTIMS IN TIRUPATHI

తిరుపతి నగర శివారులోని కొంకాచెన్నాయిగుంటలో కోట్ల రూపాయల విలువ చేసే తమ స్థలాన్ని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమించుకున్నారని బాధితుల ఆందోళన

LAND GRABBING VICTIMS PROTEST IN TIRUPATHI
LAND GRABBING VICTIMS PROTEST IN TIRUPATHI (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 8, 2025, 5:28 PM IST

Concerns Of Peddireddy Land Grab Victims in Tirupathi:కోట్ల రూపాయల విలువైన తమ స్థలాన్ని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమించుకున్నారని బాధితులు ఆందోళనకు దిగారు. ఆక్రమణకు గురైన స్ధలం వద్ద బాధితులు చేరుకుని నిరసనకు దిగారు. తమకు న్యాయం జరిగేంత వరకు తమ పోరాటం ఆగదని వారు వెల్లడించారు.

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతి శివారులోని చెన్నాయిగుంటలో తమ భూమిని ఆక్రమించుకున్నారని స్థానికులు ఆరోపించారు. తరచూ తమకు బెదిరింపులతో కూడిన ఫోన్​లు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 30 కోట్ల రూపాయల విలువైన భూములను ఆక్రమించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారు తెలిపారు. బాధితులంతా ఏకమై ముక్తకంఠంతో పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

భూ ఆక్రమణలపై గత కొంతకాలంగా న్యాయపోరాటం చేస్తున్నామని ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని కోర్టు ఆదేశాలు ఉన్నా పెద్దిరెడ్డి అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారని ఆరోపించారు. తమ వద్ద పత్రాలు అన్ని ఉన్నా పెద్దిరెడ్డి అనుచరులు ఫోన్‍ చేసి బెదిరింపులకు దిగుతున్నారన్నారని వెల్లిబుచ్చారు. కూటమి ప్రభుత్వం దీనిపై సకాలంలో స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులంతా విజ్ఞప్తి చేశారు.

''భూ ఆక్రమణలపై గత కొంతకాలంగా న్యాయపోరాటం చేస్తున్నాం. ఈ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయినా సరే పెద్దిరెడ్డి ఇక్కడ అక్రమంగా నిర్మాణాలను చేస్తున్నారు. మా వద్ద పత్రాలు అన్ని ఉన్నా సరే పెద్దిరెడ్డి అనుచరులు ఫోన్‍ చేసి బెదిరింపులకు దిగుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం దీనిపై సకాలంలో స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నాం''-బాధితులు

గతంలో సైతం:చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట అటవీ ప్రాంతంలో మాజీమంత్రి, పుంగనూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూమి ఆక్రమణ వ్యవహారాన్ని నిగ్గుతేల్చేందుకు అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. పెద్దిరెడ్డి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లేందుకు మార్కెటింగ్‌ శాఖ నిధులతో వేసిన రహదారిని జిల్లా సంయుక్త కలెక్టర్‌ విద్యాధరి, డీఎఫ్‌ఓ భరణి ఆధ్వర్యంలో సర్వే చేశారు.

అటవీ ప్రాంతంలో మాజీ అటవీశాఖ మంత్రిగారి అక్రమ సామ్రాజ్యం-చూసేద్దామా? శీర్షికతో జనవరి 29న ఈటీవీ భారత్​లో ప్రచురితమైన కథనంపై ప్రభుత్వం స్పందించింది. అందుకుగాను జిల్లా కలెక్టర్, ఎస్పీ, అనంతపురం ఫారెస్ట్‌ కన్జర్వేటర్‌లతో సంయుక్త కమిటీ ఏర్పాటుచేసింది. పెద్దిరెడ్డి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లే రహదారిని అటవీశాఖ భూమిలో ఎంత మేర వేశారన్నది నిర్ధారించుకునేందుకు మొదట రోవర్‌ ద్వారా సర్వేకు ప్రయత్నించారు. సాంకేతిక సమస్యలు ఎదురవ్వడంతో టేపుతో కొలిచారు.

అటవీ ప్రాంతంలో మాజీ అటవీశాఖ మంత్రిగారి అక్రమ సామ్రాజ్యం-చూసేద్దామా?

పెద్దిరెడ్డి భూ దోపిడీ - ఆ రోడ్డులో 2.2 కిలోమీటర్లు అటవీ భూమిలోనే!

పెద్దిరెడ్డి భూ దోపిడీ నిజమే - వెబ్‌ల్యాండ్‌ అడంగల్‌లోకి మంగళంపేట భూములు

ABOUT THE AUTHOR

...view details