Special Story On Venkat Foundation : పిల్లలు కూడా మొక్కల్లాంటివారే. కుటుంబమనే పాదులో ఆరోగ్యం అనే నారువేసి ప్రేమ అనే నీరు పోయాల్సినవారు. విద్య అనే సూర్యరశ్మిని పొంది వికసించాల్సిన వారు. పేదరికమో, కన్నవారి మరణమో ఇలా కారణం ఏదైనా సరే కొందరు పిల్లలకి ఆ పాదూ, నారూ, నీరూ, వెలుగూ దక్కవు. అలాంటివాళ్లకి మేమున్నామంటూ ముందుకొస్తున్నారు తెలుగురాష్ట్రాలకు చెందిన ఈ మంచి మనసున్నవారు. ఆ కోవకు చెందిన వారే కరీంనగర్‌కు చెందిన గంపా వెంకటేశ్.
అమ్మ స్ఫూర్తితో : కొవిడ్ లాక్‌డౌన్ కారణంగా దేశమంతా తల్లడిల్లుతున్న సమయమది. చిన్నప్పుడే అమ్మనాన్నను కోల్పోయి ప్రభుత్వ హాస్టల్‌లో తలదాచుకుంటున్న సంతోష్‌ను నిర్వాహకులు వెళ్లిపొమ్మన్నారు. అతనికి ఆశ్రయమిచ్చి ఇంతముద్ద పెట్టడానికి బంధువులు కూడా ముందుకు రాలేదు. ఎటు వెళ్లాలో తోచని పరిస్థితిలో కరీంనగర్‌లోని ‘బాలగోకులం’ గురించి తెలిసింది సంతోష్‌కు. ఫోన్ చేసిందే తడవుగా అతడిని అక్కున చేర్చుకున్నారు ఆ సంస్థ నిర్వాహకులు. మూడేళ్లకిందట ఇక్కడికొచ్చిన సంతోష్ ప్రస్తుతం సివిల్స్‌కు సిద్ధం అవుతున్నాడు. ఈ విధంగా గత పదేళ్లలో ఎంతోమంది అనాథల్ని చేరదీసి ప్రయోజకుల్ని చేసింది బాలగోకులం. ఈ ఏడాది బాలగోకులంలో 40 మంది విద్యార్థులు ఆశ్రయం పొందుతున్నారు. 10 ఏళ్లు పైబడ్డ అనాథలు ఎవరైనా ఇక్కడికి వచ్చి, ఉద్యోగం సాధించేవరకూ ఏ బాదరబందీ లేకుండా ఉండొచ్చు.
Venkat Foundation Activities :పిల్లలకి ఇష్టమైన వంటలనే చేయాలన్న నిబంధన ఉంది ఇక్కడ. వాళ్లు బడికో, కాలేజీకో వెళ్లి వచ్చాక ఉదయం సాయంత్రం కోచింగ్ తరగతులనూ నిర్వహిస్తారు. కరీంనగర్‌కు చెందిన గంపా వెంకటేశ్ అనే వ్యాపారి ఈ బాలగోకులాన్ని ఏర్పాటుచేశారు. జీవించినంత కాలం అనాథలకీ, అభాగ్యులకీ సాయపడుతూనే ఉన్న తన తల్లి స్ఫూర్తితోనే ఈ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసినట్లుగా చెబుతారాయన. ఈ ఆశ్రమం పేరు ‘వెంకట్ ఫౌండేషన్’. నెలకి లక్షన్నర రూపాయల ఖర్చుతో ఈ అనాథాశ్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఆటో డ్రైవర్ గొప్ప మనసు - అలాంటి వారి కోసం నగరంలో ఉచితంగా మంచి నీటి పంపిణీ
Man Provides Free Coaching For Students :బ్లడ్ బ్యాంకులో పనిచేసే ఓ మాములు ఉద్యోగికి నిరూపేదలు, అనాథలైన పిల్లలు గురించి ఏదైనా మంచిపని చేయాలనే ఆలోచన వచ్చింది. నిరుపేదలు, అనాథపిల్లలు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు ఏయే అవకాశాలు ఉన్నాయో బాగా తెలిసినవారు. ముఖ్యంగా ఏపీ ఆర్జేసీ - సెట్లో చదివితే ఎలాంటి పేద విద్యార్థికి అయిన మంచి ప్రమాణాలతో కూడిన విద్య అందిచ్చవచ్చని గ్రహించాడాయన. పాలిసెట్‌లో విజయం సాధిస్తే వృత్తి నిపుణులుగా ఓ స్థాయికి ఎదగవచ్చని నమ్మి ఆ రెండింటి కోసం పూర్తి ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు స్నేహిత అమృత హస్తం అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఆయనే కడప జిల్లా పులివెందులకి చెందిన మొమ్మెల రాజు.