Venkaiah Naidu Chief Guest for Womens Day in Tirupati District :రాబోయే రోజుల్లో పురుషులతో సమానంగా స్త్రీలు అన్ని రంగాల్లో రాణించాల్సిన అవసరం ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. స్వచ్చంద సేవా సంస్ధ 'రాస్' ( రాష్ట్రీయ సేవా సమితి ) ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. మహిళల అభివృద్ధి కోసం 'రాస్' సంస్ధ చేపట్టిన కార్యక్రమాలు ఎంతో మందికి ఆదర్శనీయమన్నారు. మహిళా సాధికారత సాధ్యం కావాలంటే సాంఘిక, ఆర్థిక, అధికారాల పంపిణీ జరగాలన్నారు. ప్రతి మహిళ ఖచ్చితంగా విద్యనుభ్యసించాలన్నారు.
విశాఖలోనే ప్రమాణస్వీకారం- అవకాశమిస్తే మరో పదేళ్లు ఊడ్చేయడానికి సిద్ధం: చెప్పకనే చెప్పిన సీఎం
Women Empowerment : సంప్రదాయాలు మంచివే అయినా కొన్ని సందర్బాల్లో మహిళా సాధికారికతకు అడ్డుగా మారుతున్నాయని వెంకయ్యానాయుడు అభిప్రాయపడ్డాడు. అటు సమాజం, ఇటు కుటుంబంలో మహిళల కష్టానికి సరైన ప్రతిఫలం అందుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని తెలిపారు. మహిళలకు స్వేచ్ఛ, స్వాతంత్య్రంతో పాటు ఆర్థిక సుపంపన్నత ఎంతో ముఖ్యమన్నారు. మహిళలకు ఆస్తి హక్కులో పురుఘలతో సమానంగా సగ భాగం ఇవ్వాలన్నారు. దీని కోసం సమాజం, రాజకీయ పార్టీలు ముందడుగు వేయాలన్నారు. మహిళా సాధికారత లేకుండా ఏ సమాజం అభివృద్ధి చెందడం సాధ్యం కాదని పేర్కొన్నారు. నాలుగు దశాబ్దాలుగా మహిళల అభివృద్ధికి కృషి చేస్తున్న ' రాస్ ' సేవా సమితిని అభినందించారు.