Vehicle Insurance for Vijayawada Flood Victims :కాంప్రెహెన్సివ్ ప్యాకేజీ ఉంటే ఇలా : కార్లు, బైక్‌లకు సమగ్ర వాహన బీమా / కాంప్రిహెన్సివ్ /ప్యాకేజీపాలసీ తరహావి ఉంటే పరిహారం దక్కే అవకాశం ఉంది. వాహనాలను కొన్నప్పుడే ఈ పాలసీ చేస్తారు. దీనికి ఏడాది నుంచి అయిదేళ్ల వరకు గడువు ఉంటుంది. ఈ పాలసీకే యాడ్ ఆన్ పేరుతో ‘నిల్ డిప్రీసియేషన్/జీరో డిప్రీసియేషన్ ఇంజిన్ ప్రొటెక్షన్, ఆన్ రోడ్ అసిస్టెన్స్ హైడ్రాస్టిక్ లాక్ కవర్, కన్స్యూమబుల్ కవర్ లాంటివి అదనంగా తీసుకుని ఉంటే వరద తరహా విపత్తుల్లో ఎంతో ఉపయోగకరమవుతాయి. నష్టపోయిన దాంట్లో అత్యధిక శాతం బీమా కంపెనీ నుంచి తిరిగి పొందవచ్చు. అంతేకాకుండా విపత్తు సమయాల్లో బీమా కంపెనీలు పాలసీ క్లెయిమ్ పరిష్కారాల నిబంధనలను కొంత వరకు సడలిస్తుంటాయి. గరిష్ఠంగా మూడు వారాల్లోపు దెబ్బతిన్న వాహనం వివరాలతో బీమా కంపెనీకి క్లెయిమ్ చేయగలిగితే పరిహారం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.
థర్డ్ పార్టీ బీమా అయితే :థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌లో ఎలాంటి పరిహారమూ రాదు. ఇందులో వ్యక్తిగత ప్రమాద బీమాను కలిపి తీసుకుని ఉంటే మాత్రం ఇలాంటి వరదల సమయంలో కారుతో సహా కొట్టుకుపోతే తర్వాత కారును గుర్తించి, అందులోని మనిషి చనిపోయినట్టుగా నిర్ధారించాలి. అప్పుడు ఆ మృతుని కుటుంబానికి రూ.15 లక్షల వరకు పరిహారం అందే అవకాశం ఉంటుంది.
వరదలో వాహనం కొట్టుకుపోతే : వాహనం వరదలో కొట్టుకుపోయినట్లుగా కచ్చితంగా స్థానిక పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించాలి. ఎఫ్‌ఐఆర్ పత్రం లేకుండా క్లెయిమ్ చేయలేరు. ఈ పరిస్థితుల్లో ఉంటే తొందరపడండి. మీ వాహనానికి సంబంధించిన సమగ్ర వాహన బీమాకు మూడు/నాలుగు రోజుల్లో గడువు ముగుస్తుంటే దాన్ని సత్వరమే ఆన్‌లైన్‌లో రెన్యువల్ చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని కంపెనీలు పాలసీ గడువు ముగిస్తే క్లెయిమ్ పరిష్కారానికి అంగీకరించకపోవచ్చునని
నిపుణులు హెచ్చరిస్తున్నారు.
బైక్ ఇంజన్లో బురద- వరద కథల్లో ఇదో వ్యథ - Massive Damage to Two Wheelers