ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమరావతి రాజధాని నమూనా గ్యాలరీని ధ్వంసం చేసిన దుండగులు - Amaravati Model Gallery - AMARAVATI MODEL GALLERY

Unknown Persons Destroyed Amaravati Model Gallery: తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రధాని మోదీ ప్రారంభించిన అమరావతి నమూనా గ్యాలరీని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. అమరావతి ముఖచిత్రం, కట్టడాలకు సంబంధించిన నమూనాలు, విశేషాలను తెలిపే బోర్డులను ధ్వంసం చేశారు. రాజధానిగా అమరావతిని ఓర్వలేక ఈ దారుణానికి ఒడిగట్టారని రైతులు ఆరోపించారు.

amaravati_model_gallery
amaravati_model_gallery

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 17, 2024, 4:39 PM IST

అమరావతి రాజధాని నమూనా గ్యాలరీని ధ్వంసం చేసిన దుండగులు

Unknown Persons Destroyed Amaravati Model Gallery:రాజధాని అమరావతి నమూనా గ్యాలరీని దుండగులు ధ్వంసం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఉద్ధండరాయునిపాలెంలో రాజధాని శంకుస్థాపన జరిగిన ప్రదేశంలో నమూనా గ్యాలరీని ప్రధాని మోదీ ప్రారంభించారు. ప్రస్తుతం ఇది ధ్వంసమైనట్లు స్థానిక రైతులు గుర్తించారు. అమరావతి ముఖచిత్రం, చారిత్రక ఘట్టాలు, మ్యాప్‌లు, కట్టడాలకు సంబంధించిన నమూనాలు, విశేషాలను తెలిపే బోర్డులను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని శంకుస్థాపన జరిగిన ప్రాంతానికి సరైన రక్షణ ఏర్పాటు చేయలేదు. ఆ ప్రాంగణానికి ఉన్న గేట్లనూ అక్రమార్కులు తొలగించి పక్కన పడేశారు. ప్రస్తుతం అక్కడ సెక్యూరిటీ కూడా కూడా లేరు. రాజధాని ప్రాంతంలో ఇప్పటి వరకు రోడ్లను ధ్వంసం చేసి ఇసుక, కంకర, మట్టి, ఇనుము చోరీ చేసిన దుండగులు ఇప్పుడు శంకుస్థాపన ప్రాంతాన్నీ ధ్వంసం చేయడం దారుణమని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details