ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వెరైటీ చోరీలు - ఇబ్బందులు పడుతున్న గ్రామస్థులు - Theft Street Water Taps - THEFT STREET WATER TAPS

Unknown Person Theft Street Water Taps: ఎవరైనా దొంగతనానికి వస్తే విలువైనవి ఎత్తుకుపోతారు. కానీ ఇక్కడ మాత్ర వెరైటీగా చిన్నా చితక వస్తువులు కూడా ఎత్తుకెళుతున్నారు. సాధారణంగా నగలు, డబ్బు, వాహనాలు ఎత్తుకుపోయే దొంగలను మనం చూశాం. కానీ వీరు మాత్రం కుళాయిల ఎత్తుకెళుతున్నారు. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో ఈ దొంగలతో ప్రజలు హడలిపోతున్నారు. ఈ సంఘటన మన రాష్ట్రంలోనే జరిగింది.

Unknown Person Theft Street Water Taps
Unknown Person Theft Street Water Taps

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 1, 2024, 9:00 PM IST

చిల్లర దొంగతనం - తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్న గ్రామస్థులు

Unknown Person Theft Street Water Taps :తాగునీటి కుళాయిల దొంగతనం. అవును మీరు చదివింది నిజమే. సాధారణంగా నగలు, డబ్బు, వాహనాలు ఎత్తుకుపోయే దొంగలను మనం చూశాం. కానీ వీరు మాత్రం కుళాయిల అపహరించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో ఈ దొంగలతో ప్రజలు హడలిపోతున్నారు. ఈ సంఘటన మన రాష్ట్రంలోనే జరిగింది.

అక్కడ ₹8 వేలకే ఐఫోన్ ! - భారీ రాకెట్​ను ఛేదించిన పోలీసులు - stolen Cell phones

సాధారణంగా మన వస్తువులు చోరీకాకుండా ఉండడానికి ప్రతీ ఒక్కరం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. మనం ఎంత అప్రమత్తంగా ఉన్నా ఒక్కోసారి విలువైన వస్తువులు, డబ్బులు అపహరణకు గురి అవుతాయి. కానీ ఇక్కడ మాత్రం వీధిలో ఉన్న తాగునీటి కుళాయిలను ఎత్తుకెళుతున్నారు. ఈ ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం పరిధిలోని చింతల మెరక గ్రామంలో చోటు చేసుకుంది. వీధి కులాయిలకు బిగించిన ఇత్తడి ట్యాప్​లను దొంగలు ఊడదీసి దోచుకుపోతున్నారు. గత రెండు రోజులుగా ఇదే తంతు జరుగుతోంది.

డైరెక్టర్ ఇంట్లో సర్పంచ్​ భర్త చోరీ- దొంగతనం చేసి పేదలకు పంచుతూ! - Director Joshiy House Theft

రాత్రి సమయంలో గ్రామస్థులు పడుకునేంత వరకు కుళాయిలు ఉంటున్నాయి. కానీ తెల్లారేసరికి కనుమరుగైపోతున్నాయి. దీంతో కుళాయిల నుంచి వచ్చే నీరు వృధాగా పోతోంది. అసలే వేసవి కాలం కావడంతో మంచినీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో ఈ దొంగతనాలతో ప్రజలు నీటి కొరతతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ సమస్యతో గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కుళాయి దొంగతనాలు గ్రామస్థులు చేశారో లేక వేరే వారు చేశారో తెలిక స్థానిక ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. ఇలాంటి చిల్లర దొంగలతో ప్రజలు ఇబ్బందలు పడుతున్నారు. ఈ విషయాన్ని పోలీస్ స్టేషన్ వరకు తీసుకువెళ్లారు గ్రామస్థులు.

మా దారి రహదారి అంటున్న దొంగలు- హైవే వెంట మొబైల్​ షాప్​లో భారీ చోరీ - Huge Theft in Cell Shop in Prakasam

ABOUT THE AUTHOR

...view details