ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ టు విజయవాడ రూ.3 వేలకే ఫ్లైట్​ టికెట్- ఎప్పట్నుంచంటే? - RAMMOHAN NAIDU ON AIR SERVICES

విశాఖ విమానాశ్రయంలో రెండు విమానాలు ప్రారంభించిన కేంద్రమంత్రి రామ్మోహన్‌ - 'విశాఖ-విజయవాడ' మధ్య తిరగనున్న ఎయిరిండియా, ఇండిగో విమానాలు

Rammohan Naidu Inaugurates Two Flight Service Between Visakha and Vijayawada
Rammohan Naidu Inaugurates Two Flight Service Between Visakha and Vijayawada (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 27, 2024, 1:41 PM IST

Updated : Oct 27, 2024, 1:57 PM IST

Rammohan Naidu Inaugurates Two Flight Service Between Visakha and Vijayawada :విశాఖపట్నం - విజయవాడ మధ్య కొత్తగా 2 విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. విశాఖ విమానాశ్రయంలో ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమాన సర్వీసును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు ప్రారంభించారు. ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సర్వీసు ఉదయం 9:35 గంటలకు విశాఖలో బయలుదేరి 10:35కు విజయవాడ (గన్నవరం విమానాశ్రయం) చేరుతుంది. తిరిగి రాత్రి 7:55కు విజయవాడలో బయలుదేరి 9 గంటలకు విశాఖ చేరుతుంది.

ఇండిగో సర్వీసు రాత్రి 7:15కు విజయవాడలో బయలుదేరి 8:20కి విశాఖ చేరుతుంది. అదే సర్వీసు తిరిగి రాత్రి 8:45కు విశాఖలో బయలుదేరి 9:50కి విజయవాడ చేరుతుంది. ఈ కొత్త విమానాలతో కలిపి విశాఖ - విజయవాడ మధ్య తిరిగే సర్వీసుల సంఖ్య 3కు చేరనుంది.

రూ.3000కే టికెట్ :ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు మాట్లాడుతూ, విశాఖ-విజయవాడ మధ్య ఫ్లైట్ కనెక్టివిటీ పెంచాలని చాలా మంది కోరారని తెలిపారు. ఒకేసారి రెండు నగరాల మధ్య రెండు ఫ్లైట్లు ప్రారంభం కావడం బహుశా ఇదే మొదటిసారి అని, ప్రజల కోరిక మేరకు ఈ మార్గంలో రెండు సర్వీసులు ప్రారంభించామని అన్నారు. 2 నగరాల మధ్య ఎక్కువ సీట్లు అందుబాటులోకి రావడంతో విమాన టికెట్ల ధరలు తగ్గుతాయని, విశాఖ విజయవాడ మధ్య రూ.3000కే టికెట్ దొరికే అవకాశం ఉందని తెలిపారు.

'అయ్యప్ప భక్తులు విమానంలో ఇరుముడి తీసుకెళ్లొచ్చు' - 'విశాఖ - విజయవాడ' ఫ్లైట్ ప్రారంభం

విశాఖ-గోవా మధ్య విమాన సర్వీసులు :విశాఖ ఎంతో అభివృద్ధి చెందుతున్న నగరం. దీనిని మరింత అభివృద్ధి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృతనిశ్చయంతో ఉన్నాయని రామ్మోహన్‌ నాయుడు అన్నారు. ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కనెక్టవిటీ ఎంతో అవసరమని, విశాఖ-గోవా మధ్య విమాన సర్వీసులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని, విశాఖ నుంచి అత్యధిక కనెక్టివిటీలు ఉండేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. భోగాపురంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఎయిర్‌పోర్ట్‌ నిర్మిస్తున్నామని, ఎయిర్ సర్వీస్ యూనివర్సిటీని అక్కడ పెట్టాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. రాష్ట్రంలోని కొత్త ప్రాంతాల్లో విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు వేస్తున్నామని పేర్కొన్నారు.

శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్‌పోర్ట్ నిర్మాణం : కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు - Ram Mohan on Srikakulam Airport

స్పోర్ట్స్ హబ్‌గా విశాఖ : రాష్ట్రంలో విమానయానరంగం అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారని, విజయవాడ వేదికగా డ్రోన్ షో నిర్వహించామని గుర్తు చేశారు. ఈ డ్రోన్ షో ఐదు రికార్డులు నెలకొల్పిందని, ఓర్వకల్లు ప్రాంతంలో 300 ఎకరాలు డ్రోన్ సిటీ కోసం కేటాయించామని తెలిపారు. విశాఖ నగరం మరింత అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖ నగరానికి మంత్రి నారా లోకేశ్‌ టీసీఎస్‌ను తీసుకొచ్చారని గుర్తు చేశారు. విశాఖను స్పోర్ట్స్ హబ్‌గా తయారు చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని రామ్మోహన్‌ నాయుడు వెల్లడించారు.

వారిని శిక్షించడంతో పాటు జరిమానా వేస్తాం :విమానాల్లో బాంబులు పెట్టామన్న బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రామ్మోహన్ నాయుడు హెచ్చరించారు. కారకులైన వారిని శిక్షించడంతో పాటు జరిమానా వేస్తామని చెప్పారు. ఈ మేరకు చట్టాల్లోనూ మార్పులు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు వచ్చిన బెదిరింపులపై విచారణ సాగుతోందని చెప్పారు.

ఏడాదిలోగా గన్నవరం ఎయిర్‌పోర్ట్​ కొత్త టెర్మినల్​ ప్రారంభం: కేంద్రమంత్రి రామ్మోహన్‌ - Rammohan on Vijayawada Airport

Last Updated : Oct 27, 2024, 1:57 PM IST

ABOUT THE AUTHOR

...view details