ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రంపై మరోసారి కేంద్రం వరాల జల్లు- వేల కోట్లతో పారిశ్రామిక హబ్​లు, కారిడార్లు - Industrial Hubs IN AP - INDUSTRIAL HUBS IN AP

Industrial Hubs Will Come in Kurnool and Kadapa Districts : రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి వరాల జల్లు కురిపించింది. కర్నూలు, కడప జిల్లాలో పారిశ్రామిక హబ్​లు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర కేబినెట్‌ నిర్ణయించింది. అలాగే విశాఖ- చెన్నై కారిడార్లు అభివృద్ధి చేస్తామని తెలిపింది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకు రూ.12వేల కోట్లు ఇచ్చేందుకు త్వరలో కేంద్రం అంగీకారం తెలపనుంది.

Industrial Hubs Will Come in Kurnool and Kadapa Districts
Industrial Hubs Will Come in Kurnool and Kadapa Districts (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 28, 2024, 4:11 PM IST

Updated : Aug 28, 2024, 6:57 PM IST

Industrial Hubs Will Come in Kurnool and Kadapa Districts :తయారీ రంగానికి మరింత ఊతమిచ్చేలా దేశంలోనే కొత్తగా 12 స్మార్ట్‌ పారిశ్రామిక నగరాలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర కేబినెట్‌ నిర్ణయించింది. దీని ద్వారా 10లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందని తెలిపారు. కేంద్ర కేబినెట్‌ సమావేశం ఈరోజు (బుధవారం) జరిగింది. ఇందులో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. ఉత్పత్తి రంగానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. రూ.28,602 కోట్ల పెట్టుబడితో 10 రాష్ట్రాల్లో 12 కొత్త పారిశ్రామిక కారిడార్ల (Industrial Corridors)ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగానే కడప జిల్లా కొప్పర్తి (Kopparthy)లో పారిశ్రామిక హబ్‌ కింద 2,596 ఎకరాలను అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. దీని కోసం రూ.2,137కోట్లను ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఈ హబ్‌తో 54వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. అలాగే కర్నూలు జిల్లా ఓర్వకల్లు (Orvakal)లో 2,621 ఎకరాల్లో పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకోసం రూ.2,786 కోట్లు ఖర్చుచేస్తానమన్నారు. దీంతో 45వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. దీంతో రాయలసీమకు లబ్ధి చేకూరనుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు.

పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు 100 రోజుల కార్యాచరణ - మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలన్న సీఎం - CBN REVIEW ON INDUSTRIAL PARKS

కొత్తగా 12 స్మార్ట్‌ పారిశ్రామిక నగరాలు : అలాగే భారత్‌లో ఉత్పత్తి చేసేందుకు అనేక దేశాలు ముందుకొస్తున్నాయని, ఈ రంగంలో పెట్టుబడులు పెరుగుతున్నాయని అన్నారు. తయారీ రంగానికి మరింత ఊతమిచ్చేలా దేశంలోనే కొత్తగా 12 స్మార్ట్‌ పారిశ్రామిక నగరాలను (Smart Industrial Cities) ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని ఓర్వకల్లు-కొప్పర్తి, తెలంగాణలోని జహీరాబాద్‌, రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌-పాలి, ఉత్తరాఖండ్‌లోని ఖుర్పియా, పంజాబ్‌లోని రాజ్‌పురా-పాటియాలా, మహారాష్ట్రలోని దిఘి, కేరళలోని పాలక్కడ్‌, యూపీలోని ఆగ్రా-ప్రయాగ్‌రాజ్‌, బిహార్‌లోని గయలో ఈ కారిడార్లను ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. ఈ ప్రణాళికలతో 10లక్షల మందికి నేరుగా ఉద్యోగాల కల్పన.. మరో 30లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభించనుందన్నారు. ఈ కారిడార్లు దాదాపు రూ.1.52 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తాయని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వివరించారు.

పోలవరం ప్రాజెక్టుకు రూ.12వేల కోట్లు! : ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు తెలిపారు. బుధవారం దిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓర్వకల్లు, కొప్పర్తికి ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌ సిటీలను కేంద్రం మంజూరు చేసినట్టు చెప్పారు. హైదరాబాద్‌- బెంగళూరు, విశాఖ- చెన్నై కారిడార్లు అభివృద్ధి చేస్తామని తెలిపారు. అలాగే పోలవరం ప్రాజెక్టుకు రూ.12వేల కోట్లు ఇచ్చేందుకు త్వరలో కేంద్రం అంగీకారం తెలపనుందన్నారు. నవంబరులో పోలవరం పనులు మళ్లీ ప్రారంభించేలోగా ఈ నిధులు విడుదలవుతాయని వివరించారు. గత ఐదేళ్లలో ఏపీ అనేక రంగాల్లో వెనుకబడిందని.. ఇప్పుడు డబుల్‌ ఇంజిన్‌ గ్రోత్‌ ఎలా ఉందో చూస్తున్నామని రామ్మోహన్‌ నాయుడు తెలిపారు.

ఏపీ బ్రాండ్‌ ఇమేజ్‌ తిరిగి రావాలి - నూతన పారిశ్రామిక విధానంపై అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం - CM review on New Industrial Policy

రాష్ట్రంలో పెట్టుబ‌డులపై పారిశ్రామికవేత్తల ఆస‌క్తి- అధికారుల‌తో మంత్రి టీజీ భరత్​ స‌మీక్ష - Minister Bharat Meet Officials

Last Updated : Aug 28, 2024, 6:57 PM IST

ABOUT THE AUTHOR

...view details