Two Persons Died in CM Jagan Siddham Meeting:బాపట్ల జిల్లా మేదరమెట్లలో సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సిద్ధం సభ ఇద్దరి ప్రాణాలను బలి గొంది. సభ ముగించుకొని తిరుగు ప్రయాణంలో జరిగిన తొక్కిసలాటలో ఒకరు మృతి చెందగా, మరొకరు సృహ తప్పి పడిపోయారు. సృహ కొల్పోయిన వ్యక్తిని ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. మృతుడు ఒంగోలు పురపాలక సంఘంలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్న మురళిగా గుర్తించారు. హాస్పటల్ సిబ్బంది కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో హడావుడిగా హాస్పటల్‌కి చేరుకున్నారు. అక్కడకి వచ్చాక ముకళి మృతి చెందారని చెప్పడంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు గురయ్యారు.
జనాలను హడలెత్తించిన సీఎం సభ- ఇంట్లో ఉన్నవారు సేఫ్! బస్సుల బంద్‌కు తోడు పోలీసు ఆంక్షలు
బస్సునుంచి పడి వ్యక్తి మృతి:మేదరమెట్ల వైసీపీ సిద్ధం సభ నుంచి తిరిగి వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందారు. ప్రైవేటు స్కూల్ బస్సులో తిరిగి వెళ్తుండగా నరసరావుపేటకు చెందిన బాలదుర్గారావు అదుపుతప్పి కిందపడిపోయాడు. బస్సు వెనుక చక్రాలు అతని తలపై నుంచి పోవడంతో దుర్గారావు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఘటనాస్థలిలో మృతుని బంధువులు బోరున విలపించారు. విషయం తెలిసిన నాన్‌హైవే సిబ్బంది ట్రాఫిక్ అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకున్నారు.
వైసీపీ నేతల అరాచకం - 'సిద్ధం' సభకు పిలిచినా రాలేదని కర్రలు, రాడ్లతో దాడి
ఏరులై పారిన మద్యం:బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం పిచుకుల గుడిపాడులో సిద్ధం సభలో మద్యం ఏరులై పారింది. రాష్టం నలుమూలల నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సులు, వివిధ వాహనాల్లో జనాన్ని తరలించారు. బస్సుల్లో మద్యం సీసా, బిర్యానీ పొట్లాలు పంపిణీ చేశారు. దీంతో సభకు వచ్చిన వాళ్లు మద్యం సేవించి మత్తులో జోగారు. ముఖ్యమంత్రి హెలికాప్టర్లో వచ్చిన కొద్దిసేపటికే సభాప్రాంగణం నుండి జనం వెళ్లిపోయారు.
వైసీపీ 'సిద్ధం' సభ కవరేజీకి వెళ్లొద్దు - మీడియా సిబ్బందికి పోలీసుల నోటీసులు
సభ అయ్యేంత వరకు లారీలు ఆగాల్సీందే: మేదరమెట్ల సమీపంలో వైసీపీ నాయకులు ఏర్పాటు చేసిన సిద్ధం సభ కారణంగా లారీ, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మేదరమెట్ల వద్ద ఉన్న 16 నెంబర్ జాతీయ రహదారి కావడంతో లారీలను ఆపివేశారు. చెన్నై నుంచి హైదరాబాద్‌కు వెళ్లేందుకు ఒంగోలులోని నుంచి పొదిలి, దర్శి మీదగా తరలించారు. విజయవాడకు వెళ్లాలి అంటే చీరాల వైపుకు పంపించారు. అయితే చీరాల బైపాస్ వైపు తరలించే వైపు లారీలను మాత్రం నిలిపివేశారు.
సిద్ధం సభ అయ్యేంతవరకు పోలీసులు లారీలను రోడ్డు పక్కనే నిలిపివేశారు. ఆ సమయంలో చెన్నై నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన లోడ్‌తో వస్తున్న లారీ పక్కకు పెడుతున్న సమయంలో చిన్న గుంటలో పడి పల్టీ కొట్టింది. అదృష్టవశాత్తు లారీలో ఉన్న డ్రైవర్ సురక్షితంగా ఉన్నాడు. సిద్ధం సభ ఏర్పాటు చేస్తే మా వాహనాలను ఎందుకు పంపకుండా నిలిపారని లారీ డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్ధం సభ పూర్తి అయ్యాకే ఇక్కడ నుంచి బయలుదేరాల్సి ఉందని లారీ డ్రైవర్లకు పోలీసులు చెప్పారు.