Elephant Created Havoc in Chittoor District: చిత్తూరు జిల్లా శాంతిపురం, గుడుపల్లి మండలంలోని అత్తినత్తములో ఒక ఏనుగు బీభత్సం సృష్టించింది. కోనేరుకుప్పం, గొల్లపల్లి శివారులో ఏనుగు పంటలను తొక్కి నాశనం చేసి వెంకటాచలం అనే రైతుపై దాడి చేసింది. ఏనుగు దాడిలో రైతుకు తీవ్ర గాయాలయ్యాయి. కోనేరుకుప్పం పరిసరాల్లో ఏనుగు సంచరిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రాళ్లబూదుగూరు వద్ద ఓ కారును ఏనుగు అడ్డుకుని ధ్వంసం చేసింది. ఏనుగులు చేస్తున్న దాడులపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు హల్చల్- వ్యక్తి మృతి
Two Elephants Are Roaming at Forest Area:అన్నమయ్య జిల్లా కలికిరి, వాల్మీకిపురం మండలాల సరిహద్దుల్లోని మేకలవారిపల్లె అటవీ ప్రాంతంలో రెండు ఏనుగులు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గుట్టపాళెం, బర్నేపల్లె, మేకలవారిపల్లె, ఎర్రగుంట్లబావి తదితర అటవీ ప్రాంత రైతులు పొలాల వద్దకు ఒంటరిగా వెళ్లవద్దని అటవీ శాఖ అధికారులు సూచించారు. అడవిలో ఏనుగులు తిష్ట వేసి ఉన్నందున గొర్రెలు, మేకల కాపరులు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అటవీ ప్రాంత గ్రామ ప్రజలను అప్రమత్తం చేయాలని కోరుతూ అటవీశాఖ అధికారి గిరినాథ గ్రామ వాలంటీర్లకు సంక్షిప్త సమాచారాన్ని చేర వేశారు. కొంతమంది గ్రామస్థులు చరవాణుల్లో తీసిన ఏనుగుల చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఏనుగులు అటవీ ప్రాంతంలో సంచరిస్తుండటంతో చుట్టు ప్రక్కల గ్రామ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఏనుగులు కనిపించినట్లు ఉంటే వెంటనే సమాచారం ఇవ్వాలని గ్రామ ప్రజలకు అధికారులు విజ్ఞప్తి చేశారు.