Distribute Compensation to Tirupati Stampede Victims:తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు పరిహారం అందించడానికోసం టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు బోర్డు సభ్యులతో 2 బృందాలను నియమించారు. మృతుల కుటుంబాలు, గాయపడిన వారికి ఆదివారం నుంచి ఈ బృందాలు పరిహారం చెక్కులు అందివ్వనున్నాయి. విశాఖ, నర్సీపట్నం వెళ్లే బృందంలో బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, జంగా కృష్ణమూర్తి, పనబాక లక్ష్మి, జానకీదేవి, మహేందర్‌రెడ్డి, ఎం.ఎస్ రాజు, భానుప్రకాశ్‌రెడ్డి ఉన్నారు.
తమిళనాడు, కేరళ వెళ్లే బృందంలో శ్రీరామమూర్తి, కృష్ణమూర్తి వైద్యనాథన్, నరేష్ కుమార్, శాంతారాం, సుచిత్ర ఎల్ల ఉన్నారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు చొప్పున, కుటుంబ సభ్యుల్లో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం ఇవ్వనున్నారు. మృతుల కుటుంబాల్లో పిల్లలకు విద్య అందించేందుకు ఈ బృందం వివరాలు సేకరించనుంది. తీవ్రంగా గాయపడిన ఇద్దరికి రూ.5 లక్షలు చొప్పున, గాయపడిన మరో 31 మందికి రూ.2లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నారు.
ఇంతమంది అధికారులున్నా తప్పు ఎందుకు జరిగింది?: పవన్ కల్యాణ్
ఆస్పత్రిలో బాధితులకు చెక్కులు పంపిణీ: ముందుగా బాధితులకు స్విమ్స్ ఆస్పత్రిలో 7 మంది బాధితులకు టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్ నాయుడు పరిహారం అందజేశారు అందజేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు బాధితులకు పరిహారం అందజేస్తున్నామని తెలిపారు. తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డ అన్నమయ్య జిల్లాకు చెందిన సర్వశ్రీ ఎస్.తిమ్మక్కకు రూ.5 లక్షలు, విశాఖపట్నం జిల్లాకు చెందిన పి.ఈశ్వరమ్మకు రూ.5 లక్షలు చొప్పున పరిహారాన్ని టీటీడీ ఛైర్మన్ అందజేశారు.