తెలంగాణ

telangana

ETV Bharat / state

పసుపు పంటకు పూర్వ వైభవం వచ్చేనా? - గిట్టుబాటు ధర లేక సాగు తగ్గిస్తున్న రైతులు - నిజామాబాద్​లో పసుపు పంట సాగు

Turmeric Farmers Problems In Nizamabad : నిజామాబాద్‌ జిల్లాలో పసుపు విస్తీర్ణం తగ్గుతోంది. కొన్నేళ్లుగా ధర లేక రైతులు సాగు తగ్గించారు. ఈసారి ధర పెరిగినా తెగుళ్లు, వర్షాలతో ఆశించిన దిగుబడి రాలేదు. విస్తీర్ణం తగ్గినందున పసుపు అత్యధిక ధరలకు చేరుకుంటుందని అన్నదాతలు భావిస్తున్నారు. ఇప్పటికే కేంద్రం పసుపు బోర్డు ప్రకటించగా పరిశోధనా స్థానం ఏర్పాటు కానుంది. పసుపు రైతులకు మళ్లీ పూర్వ వైభవం వస్తుందని కర్షకులు భావిస్తున్నారు. గతేడాదితో పోలిస్తే పదివేల ఎకరాల సాగు విస్తీర్ణం తగ్గడం ఆందోళన కలిగిస్తోంది.

Nizamabad Turmeric Farmers Problems
Turmeric Farmers Problems in Nizamabad

By ETV Bharat Telangana Team

Published : Feb 1, 2024, 9:25 AM IST

పసుపు పంటకు పూర్వ వైభవం వచ్చేనా? - గిట్టుబాటు ధర లేక సాగును తగ్గిస్తున్న రైతులు

Turmeric Farmers Problems In Nizamabad :నిజామాబాద్‌ జిల్లాలో పదేళ్ల క్రితం 50వేల ఎకరాలకు పైగా పసుపు సాగయ్యేది. కొన్నేళ్లుగా ధర తగ్గడం పెట్టుబడి పెరగడం వల్ల గిట్టుబాటు కాకపోవడంతో సాగు విస్తీర్ణం తగ్గిస్తూ వస్తున్నారు. గతంలో 10 ఎకరాల వరకు పండించిన రైతులు ప్రస్తుతం సగానికి తగ్గించేశారు. ఏళ్లుగా సాగుచేస్తున్న పసుపు పంట వల్ల నష్టాలు పెరగడంతో ఈ ఏడు 26వేల ఎకరాల్లోనే పంట వేశారు. గతేడాదితో పోలిస్తే ఏకంగా పదివేల ఎకరాల సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. జగిత్యాల, నిర్మల్ జిల్లాల పరిధిలోనూ కొంతమేర సాగు విస్తీర్ణం తగ్గించారు.

Nizamabad Turmeric Farmers Problems : పసుపు సాగుకు ఏటా పెట్టుబడి పెరుగుతోంది. ధర వస్తుందనే నమ్మకంతో రైతులు పంట సాగు చేస్తున్నా గిట్టుబాటు కావట్లేదు. వేసినప్పటి నుంచి తవ్వి ఉడక బెట్టే వరకు 80వేల నుంచి లక్షా 20వేల వరకు రైతులు ఖర్చు చేస్తున్నారు. పంటవేసే సమయంలో మట్టి, పశువుల ఎరువు వేస్తున్నారు. అందుకి ఎకరాకు 20వేల వరకు ఖర్చు చేస్తున్నారు. విత్తనం, ఎరువులు, మందులు, ఇతర పనుల కోసం భారీగా వ్యయం అవుతోంది పసుపు తవ్వేందుకు ఎకరాకు 10నుంచి 15వేల వరకు ఉడక బెట్టేందుకు 5వేల వరకు ఖర్చు అవుతోంది. మొత్తంగా లక్ష వరకు పెట్టుబడి ఖర్చు అవుతోంది. ఎకరాకు 20క్వింటాళ్ల దిగుబడి రావడం వల్ల కర్షకులకు ఆశించిన ఆదాయం రావడం లేదు.

పాతాళానికి పడిపోతున్న పసుపు ధరలు.. ఆవేదనలో అన్నదాతలు

Turmeric Farmer Problems In Telangana: కొన్నేళ్లుగా క్వింటాల్‌కు ఐదువేల నుంచి ఆరున్నర వేల మధ్య ధరలు పలుకుతున్నాయి. కొద్దిమంది కర్షకులు క్వింటా 8వేల వరకు అమ్మినా ఎక్కువ మందికి గిట్టుబాటు ధర రావట్లేదు. కాడి, గోళా రకాలకు ధరలు ఎక్కువగా రాకపోవడంతో సాగుదారులుసమస్య ఎదుర్కొంటున్నారు. వ్యాపారుల మాయాజాలంతో మద్దతు ధర దక్కక రైతులు నష్టపోతున్నారు. ఈఏడాది ధరలు రైతుల్లో ఆశలు కలిగిస్తున్నాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ పెరగడం వల్ల ఆర్నెళ్లుగా ధర పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం క్వింటా 8వేల 500 నుంచి 12 వేల500 మధ్య పలుకుతోంది.

పసుపు బోర్డు ప్రకటనతో పాటు పరిశోధన కేంద్రాన్నిఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించారు. పార్లమెంట్ ఎన్నికల ముందే పసుపు బోర్డుకు సంబంధించిన సన్నాహాలు మొదలవుతాయని భావిస్తున్నారు. పసుపు బోర్డుతోపాటు పసుపు పరిశోధన కేంద్రాన్నిఏర్పాటు చేస్తే పంటకు డిమాండ్ వస్తుందని రైతులు అంచనా వేస్తున్నారు. ఏమైనా ఈసారి సీజన్‌ ప్రారంభంలోనే అధికధరలులభిస్తున్నాయి. ఇదేరీతిన ధరలు ఉంటే పసుపు పంటకు పూర్వ వైభవం వచ్చినట్టేనని కర్షకులు చెబుతున్నారు.

Turmeric Board in Telangana 2023 : పసుపు బోర్డు కోసం దశాబ్దాలుగా రైతుల డిమాండ్‌.. ఏర్పాటు దిశగా కేంద్రం అడుగులు

'రాష్ట్రానికి గిరిజన విశ్వవిద్యాలయం, పసుపు బోర్డు' ప్రకటించిన ప్రధాని

ABOUT THE AUTHOR

...view details