ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తునిలో మారుతున్న రాజకీయ సమీకరణాలు - టీడీపీలో చేరిన ఆరుగురు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు - TUNI YSRCP COUNCILLORS JOIN TDP

తునిలో వైఎస్సార్సీపీకి షాక్‌ - తెలుగుదేశం పార్టీలో చేరిన ఆరుగురు కౌన్సిలర్లు

Tuni YSRCP Councillors Join TDP
Tuni YSRCP Councillors Join TDP (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 24, 2025, 10:32 PM IST

Tuni YSRCP Councillors Join TDP : కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇవాళ పలువురు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సమక్షంలో వారు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి యనమల తెలుగుదేశం కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీలో చేరిన వారిలో రూపాదేవి, శ్రీను, ప్రభావతి, వెంకటరమణ, నాగలక్ష్మి, సుభద్రాదేవి ఉన్నారు.

తెలుగుదేశం పార్టీలో చేరినందుకు ఆనందంగా ఉంది. మేము స్వచ్ఛందంగా చేరాం. మమల్ని ఎవ్వరూ ప్రలోభాలకు గురిచేయలేదు. మేమందరం ఇష్టపూర్వకంగా టీడీపీలో చేరాం. ఇప్పటివరకూ 16 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరాం. తుని అభివృద్ధి కోసం పనిచేస్తాం. తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేందుకు మా వంతు కృషి చేస్తాం. - కౌన్సిలర్లు

ఇప్పటి వరకు 16 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. ఇప్పటికే మెజార్టీ సభ్యులు తెలుగుదేశం పార్టీలో మరికొంతమంది వచ్చే అవకాశమున్నట్లు సమాచారం. మరోవైపు ఇవాళ ఉదయం మున్సిపల్‌ ఛైర్మన్ పదవికి సుధారాణి రాజీమా చేశారు. అదేవిధంగా ఉపాధ్యక్ష ఎన్నిక వాయిదా పడుతూ వస్తోంది. కోరం లేక నాలుగుసార్లు వైస్ ఛైర్మన్ ఎన్నికను వాయిదా వేశారు. దీంతో తునిలో మరోసారి ఎన్నిక నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే మెజార్టీ సభ్యులు టీడీపీలో చేరడంతో పార్టీ మద్దతు తెలిపిన అభ్యర్థులకే ఛైర్​పర్సన్, ఉపాధ్యక్ష పదవి దక్కే అవకాశం ఉంది.

పాలకొండ ఛైర్​పర్సన్‌ ఎన్నిక వాయిదా - ఆ అధికారి తీరే కారణమా?

ఉత్కంఠకు తెర - తిరుపతి డిప్యూటీ మేయర్‌ పదవి టీడీపీదే

ABOUT THE AUTHOR

...view details