Tungabhadra Dam Gate Repair Works Started:కర్ణాటకలోని హోస్పేట వద్ద కర్ణాటకతోపాటు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం 100 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన తుంగభద్ర జలాశయంలోని 19వ గేటు శనివారం రాత్రి కొట్టుకుపోయింది. ఎగువన కురిసిన వర్షాలకు కొద్దిరోజుల క్రితమే జలాశయం పూర్తి స్థాయిలో నిండిపోయింది. షిమోగలో వర్షాలకు డ్యామ్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరద పోటుకు శనివారం రాత్రి చైన్‌లింక్ తెగడంతో 19వ నెంబర్ గేటు కొట్టుకుపోయింది.
జలాశయం నుంచి లక్షల క్యూసెక్కుల నీరు వృథాగా పోతోంది. దీంతో మిగతా గేట్లపై భారం పడకుండా మొత్తం 8 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కొట్టుకుపోయిన గేటు స్థానంలో కొత్తది ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. వరద ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. తుంగభద్రలో జలాశయంలో ప్రస్తుతం నిల్వ ఉన్న నీటిలో 60 టీఎంసీలు ఖాళీ చేసిన తర్వాతే గేట్లు బిగించే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం రోజుకు 9 టీఎంసీల చొప్పున 60 టీఎంసీలు ఖాళీ చేయనున్నారు. ఆ తర్వాతే కొత్త గేటు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. గేటు మరమ్మతులు చేసే వరకు తుంగభద్ర నుంచి సుంకేసుల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. నదీ పరివాహక ప్రాంతాలైన కర్నూలు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలను అప్రమత్తం చేశారు.
కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యాం గేటు- సీఎం చంద్రబాబు ఆదేశాలతో అప్రమత్తమైన మంత్రులు - Tungabhadra Dam Gate Collapsed
డ్యాంను పరిశీలించిన కర్ణాటక డిప్యూటీ సీఎం: తుంగభద్ర గేటు కొట్టుకుపోవడంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్‌తో మాట్లాడారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సాయిప్రసాద్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. చంద్రబాబు ఆదేశాలతో ఇంజినీర్ల బృందం, సెంట్రల్ డిజైన్ కమిషనర్ తుంగభద్ర జలాశయం వద్దకు వెళ్లారని మంత్రి రామానాయుడు తెలిపారు. కౌతాలం, కోస్గి, మంత్రాలయం, నందవరం ప్రాంతాల ప్రజలు అప్రమత్తం చేశామని చెప్పారు.
తుంగభద్ర డ్యామ్‌ను రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పరిశీలించారు. కొట్టుకుపోయిన గేటు గురించి ఆరా తీశారు. ప్రత్యామ్నాయలపై అధికారులతో చర్చించారు. ఐదేళ్లుగా తుంగభద్ర డ్యామ్ నిర్వహణను గత ప్రభుత్వం గాలికొదిలేసింది. తుంగభద్ర డ్యామ్ నిర్వహణకు రాష్ట్ర వాటాగా 35 శాతం ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. అయితే జగన్ సర్కార్ ఒక్క రూపాయి విడుదల చేయలేదు. ఆ పాపాలే నేటికీ వెంటాడుతున్నాయి. నిర్వహణా లోపం వల్లే గేటు కొట్టుకుపోయిందనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.
మొదలైన విజయవాడ కాలువల సందరీకరణ పనులు - Vijayawada Canals Cleaning
రాళ్లు రువ్వి, చెయిన్ లాగి- నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో చోరీకి యత్నం - Robbery Attempt in Narsapur Expres