ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీవారి ఆలయంలో శృతిమించిన ఆకతాయిల అల్లరి - నెట్టింట్లో ప్రాంక్ వీడియో దుమారం - TTD React on TPT Prank Video - TTD REACT ON TPT PRANK VIDEO

TTD React on TPT Prank Video: ప్రపంచ ప్రసిద్ధ దేవాస్థానాల్లో ఒకటైన తిరుమల ఆలయంలో ఆకతాయిల అల్లర్లు శృతిమించిపోతున్నాయి. శ్రీవారి ఆలయంలోనే ప్రాంక్ వీడియోలు తీసి భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారు. ఇలాంటి ఘటనలపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసి విచారణకు ఆదేశించింది.

TTD_React_on_TPT_Prank_Video
TTD_React_on_TPT_Prank_Video (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 12, 2024, 9:10 AM IST

Prank Video in Tirumala : తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆకతాయిలు హల్​చల్​ సృష్టించారు. శ్రీవారి దర్శనానికి వెళ్లే నారాయణగిరి ఉద్యానవన షెడ్లల్లో కొందరు ఆకతాయిలు తీసిన ప్రాంక్ వీడియోలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి. తమిళనాడు రాష్ట్రానికి చెందిన టీటీఎఫ్ వాసన్ తన మిత్రులతో కలిసి దర్శనానికి వెళ్లే సమయంలో నారాయణగిరి షెడ్ల క్యూ లైనులో వెళ్తుంతుండగా అక్కడ షెడ్ల వద్దకు వెళ్లి గేటు తాళాలను తెరవడానికి వెళ్లినట్లుగా నటించారు.

వారిని టీటీడీలో సిబ్బందిగా భావించిన షెడ్లలోని భక్తులు ఆశగా నిలబడ్డారు. తీరా చూస్తే వారు ప్రాంక్ వీడియో చేశారు. ఈ సన్నివేశాన్ని చిత్రీకరించిన ఆకతాయిలు సామాజిక మాధ్యమైన ఇన్ స్టాగ్రామ్​లో అప్​లోడ్​ చేశారు. ఈ వీడియో వైరల్​గా మారింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కంపార్టుమెంట్లలో ప్రాంక్‌ వీడియోల ఘటనపై టీటీడీ స్పందించింది. భక్తుల మనోభావాలతో ముడిపడిన దీనిపై టీటీడీ విజిలెన్స్ ఆగ్రహం వ్యక్తం చేసి విచారణకు ఆదేశించింది.

ABOUT THE AUTHOR

...view details