ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నకిలీ టికెట్లతో శ్రీవారి దర్శనం - పోలీసుల అదుపులో ఐదుగురు - FAKE DARSHAN TICKET FRAUD TIRUMALA

తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శన నకిలీ టికెట్లతో మోసాలు - విచారణలో ఐదుగురు నిందితులను గుర్తించిన అధికారులు

Fake Darshan Ticket Fraud in Tirumala
Fake Darshan Ticket Fraud in Tirumala (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 15, 2025, 5:56 PM IST

Fake Darshan Ticket Fraud in Tirumala : నకిలీ ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300 టికెట్లు) టికెట్లతో భక్తులకు తిరుమల శ్రీవారి దర్శనం కల్పిస్తున్న వ్యవహారం బయటకు వచ్చింది. కొందరు దళారులు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం నకిలీ టికెట్లతో భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు. దీంతో అనుమానం వచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విజిలెన్స్‌ అధికారులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద కొందరు భక్తులను నిలిపివేశారు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన విజిలెన్స్‌ అధికారులు ట్యాక్సీ డ్రైవర్ల ద్వారా నకిలీ టికెట్లు విక్రయిస్తున్నట్లు నిర్ధారించారు.

విచారణలో ఐదుగురు నిందితులను అధికారులు గుర్తించారు. వారిలో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కౌంటర్‌ ఉద్యోగి లక్ష్మీపతి, అగ్నిమాపక శాఖ సిబ్బంది మణికంఠ, భానుప్రకాశ్‌, ట్యాక్సీ డ్రైవర్లు జగదీశ్​, శశి ఉన్నారు. లక్ష్మీపతి విధుల్లో ఉన్నప్పుడు నకిలీ టికెట్లతో దర్శనానికి పంపుతున్నట్లు నిర్ధారించారు. మణికంఠ సాయంతో నకిలీ టికెట్లు తయారు చేస్తున్నారని ట్యాక్సీ డ్రైవర్లు శశి (తిరుపతి), జగదీశ్‌ (చెన్నై) ద్వారా భక్తులకు టికెట్లు విక్రయిస్తున్నట్లు తేల్చారు.

హైదరాబాద్, ప్రొద్దుటూరు, బెంగళూరుకు చెందిన 11 మంది భక్తుల నుంచి రూ.19 వేలు వసూలు చేసినట్లు విచారణలో వెల్లడైంది. ప్రస్తుతం ఈ ఐదుగురు నిందితులను టీటీడీ విజిలెన్స్‌ అధికారులు, వన్‌ టౌన్‌ పోలీసులు విచారిస్తున్నారు.

తిరుమల పరకామణిలో విదేశీ కరెన్సీ స్వాహా - విచారణకు డిమాండ్​

ABOUT THE AUTHOR

...view details