TTD Council Member Bhanu Prakash Fire on YSRCP:గత ఐదేళ్లలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వైఎస్సార్సీపీ నేతలు తమ ఎస్టేట్‌గా మార్చుకున్నారని టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వారి పాలనలో టీటీడీలో అక్రమాలకు పాల్పడిన వారిని రక్షించడానికి వైఎస్సార్సీపీ నేతలు, టీటీడీ ఉన్నతాధికారులు ఎంతో ప్రయత్నించారని విమర్శించారు. వీరు అక్రమార్కులతో రాజీ కుదుర్చుకొని కేసులు పెట్టకుండా వదిలేశారని ఆయన తెలిపారు. 2023 జూన్ నెలలో కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అక్రమాలు జరిగాయని ఆయన దుయ్యబట్టారు.
భక్తులు సమర్పించిన విరాళాలను పూర్తిగా దుర్వినియోగం చేశారని భానుప్రకాశ్ అన్నారు. ఐదేళ్లపాటు వైఎస్సార్సీపీ హయాంలోే నేతలు టీటీడీని దారుణంగా దోచుకున్నారని ఆయన చురకలంటించారు. టీటీడీ విజిలెన్స్ విభాగంలో శివశంకర్ అనే అధికారి అక్రమాలకు పాల్పడ్డా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. శివశంకర్‌పై కేసు నమోదు చేయకుండా డిప్యుటేషన్ రద్దు చేసి మళ్లీ వేరే శాఖకు బదిలీ చేశారన్నారు. పరకామణిలో విదేశీ కరెన్సీ దొంగిలించిన రవికుమార్‌ను తప్పించడంలో శివశంకర్ కీలకంగా వ్యవహరించారన్నారు. గతంలో టీటీడీలో జరిగిన అక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని భానుప్రకాష్ స్పష్టం చేశారు.
2019-24 వరకు టీటీడీ దేవస్థానాలను వైకాపా ఎస్టేట్‌గా మార్చారు. టిటిడిలో అక్రమాలకు పాల్పడిన వారిని తప్పించడానికి ప్రయత్నాలు చేశారు. అక్రమార్కులతో రాజీ కుదుర్చుకొని కేసులు పెట్టకుండా వదిలేశారు. 2023 జూన్ నెలలో కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అక్రమాలు జరిగాయి. భక్తులు సమర్పించిన విరాళాలను దుర్వినియోగం చేశారు. గడచిన ఐదేళ్లలో వైకాపా నేతలు టీటీడీని దారుణంగా దోచుకున్నారు. టీటీడీ విజిలెన్స్ విభాగంలో శివశంకర్ అనే అధికారి అక్రమాలకు పాల్పడ్డారు. అక్రమాలకు పాల్పడిన శివకుమార్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గతంలో టీటీడీలో జరిగిన అక్రమాలను సీఎం దృష్టికి తీసుకెళ్తాం. -భానుప్రకాష్ రెడ్డి, టీడీడీ పాలకమండలి సభ్యుడు