తెలంగాణ

telangana

ETV Bharat / state

'తిరుమలలో ఏదైనా సమస్యా? - టీటీడీకి ఈజీగా చెప్పొచ్చు!' - TTD BOARD MEETING KEY DECISIONS

టీటీడీ బోర్డు సమావేశం కీలక నిర్ణయాలు - ఫీడ్ బ్యాక్‌ వ్యవస్థ ఏర్పాటుకు నిర్ణయం - భక్తుల ఆరోగ్యం దృష్ట్యా అందుబాటులోకి ఫుడ్‌ సేఫ్టీ విభాగం

TTTD EO Latest Comments on Tirumala Devotees And Facilities
TTD EO Latest Comments on Tirumala Devotees And Facilities (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 24, 2024, 7:52 PM IST

TTD EO Latest Comments on Tirumala Devotees And Facilities :శ్రీవారి దర్శనం, తిరుమలలో వసతి సౌకర్యాల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో టీటీడీ పాలకమండలి సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన సులభతరమైన శ్రీవారి దర్శనం కోసం కొన్ని సూచనలు వచ్చాయనన్నారు.

తిరుమలలో తక్కువ ధరకే నాణ్యమైన ఆహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నా ఆయన భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో అన్నప్రసాద తయారీ కేంద్రంలో ప్రస్తుతం ఉన్న సిబ్బంది సరిపోవడం లేదని, తగింత సిబ్బందిని త్వరలో నియమిస్తామని తెలిపారు. కొండపై భక్తుల ఆరోగ్య దృష్ట్యా ఫుడ్‌ సేఫ్టీ విభాగాన్ని ఏర్పాటు చేస్తామని పాలకమండలి సమావేశంలో నిర్ణయించినట్లు చెప్పారు. దేవస్థానానికి వచ్చే భక్తుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరించేందుకు వీలుగా ఫీడ్‌ బ్యాక్‌ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.

హాట్​ కేకుల్లా తిరుమల శ్రీవాణి దర్శన టికెట్లు - ఉదయం నుంచే భక్తుల బారులు

చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేస్తాం :టీటీడీ కార్యక్రమాలను ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారని ఆలయ ఈవో తెలిపారు. అందుకు మార్గదర్శకాలను కమిటీ వేసి రూపొందిస్తున్నామన్న ఆయన ప్రతి రాష్ట్రంలో ఆలయ నిర్మాణం చేపడతామని వెల్లడించారు. స్విమ్స్‌ ఆసుపత్రికి జాతీయ హోదా కోసం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామని, వారి ఆర్థిక సహాయంతో స్విమ్స్‌ను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. నడక భక్తులకు ఆరోగ్య సమస్యలు వస్తే అందుబాటులో ఉండడానికి చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

"శ్రీవారి దర్శనం, వసతి సౌకర్యాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం. తిరుమలలో తక్కువ ధరకే మంచి ఆహారం ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం. టీటీడీ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని సీఎం చంద్రబాబు చెప్పారు. ఆ దిశగా అడుగులు వేస్తాం. ప్రతి రాష్ట్రంలో శ్రీవారి ఆలయం నిర్మిస్తాం. నడక భక్తుల ఆరోగ్య సమస్యలు తగ్గించేందుకు ఎక్కువ చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేస్తాం." - టీటీడీ ఈవో శ్యామలరావు

పాఠశాలకు రూ.2కోట్లు విడుదల :టీటీడీ సేవలపై భక్తుల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకునేందుకు డిజిటల్ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని బోర్డు నిర్ణయించిందని అన్నారు. తిరుపతి లోన కంటి కామకోటి సంప్రదాయ పాఠశాలకు రూ. 2కోట్లు విడుదల చేస్తామని ప్రకటించారు. టీటీడీలో ఆహార బోర్డుకు పాలక మండలి ఆమోదం తెలిపిందని ఆయన స్పష్టం చేశారు.

భక్తుల కోసం టీటీడీ కీలక చర్యలు - తిరుమలలో ఇక సులభంగా వసతి

తిరుమల శ్రీవారి దర్శనానికి ఎన్ని దారులో - ఇవి తెలిస్తే దర్శనం సులభమే

ABOUT THE AUTHOR

...view details