తెలంగాణ

telangana

ETV Bharat / state

సిబ్బందిపై దాడి ఘటనలపై ఆర్టీసీ యాజమాన్యం సీరియస్‌ - బాధ్యులపై చర్యలు తప్పవని వార్నింగ్ - టీఎస్‌ఆర్టీసీ

TSRTC Management Serious on Attacks on its Staff : నిబద్దత, క్రమశిక్షణతో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తోన్న తమ సిబ్బందిపై దాడులు చేస్తే ఉపేక్షించబోమని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ యాజమాన్యం స్పష్టం చేసింది. ప్రతి రోజూ సగటున 55 లక్షల మంది ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్న సిబ్బందిపై దుర్భాషలాడుతూ దాడులు చేయడం ఏమాత్రం సమంజసం కాదని పేర్కొంది.

Mahalakshmi Scheme in Telangana
TSRTC Management Serious on Attacks on its Staff

By ETV Bharat Telangana Team

Published : Jan 31, 2024, 5:58 PM IST

Updated : Jan 31, 2024, 6:03 PM IST

TSRTC Management Serious on Attacks on its Staff : తమ సిబ్బంది విధులకు ఆటకం కలిగించే, దాడులకు పాల్పడే వ్యక్తులపై చట్టప్రకారం చర్యలుంటాయని టీఎస్‌ఆర్టీసీ(TSRTC) హెచ్చరించింది. నిబద్దత, క్రమశిక్షణతో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తోన్న తమ సిబ్బందిపై కొందరు దాడులకు దిగడాన్ని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేస్తోన్న సిబ్బందిపై దుర్భాషలాడుతూ దాడులు చేయడం ఏమాత్రం సమంజసం కాదని పేర్కొంది. పోలీస్ శాఖ సహకారంతో నేరస్థులపై హిస్టరీ షీట్స్ తెరిచేలా చర్యలు తీసుకుంటామని సంస్థ హెచ్చరించింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎక్స్​లో పోస్ట్ చేశారు.

తప్పతాగి ఆర్టీసీ బస్సులో మహిళ హల్​చల్​ - చిల్లర కోసం కండక్టర్​పై దాడి

టీఎస్ఆర్టీసీ కండక్టర్లపై ఇటీవల మూడు చోట్ల మహిళలు దాడులకు పాల్పడ్డారు. హయత్‌నగర్ డిపో-1కు(Hayathnagar Bus Attack) చెందిన ఇద్దరు కండక్టర్లపై నానా దుర్బాషలాడుతూ వేర్వేరుగా దాడికి దిగారు. చిల్లర విషయంలో ఒక మహిళ, గుర్తింపు కార్డును చూపించి జీరో టికెట్‌ను తీసుకోవాలని కండక్టర్ చెప్పినందుకు, ఆయన సెల్ ఫోన్ లాక్కుని అసభ్యపదజాలంతో మరో మహిళ దూషించారు. పికెట్ డిపోకు చెందిన మహిళా కండక్టర్‌పై యాదగిరిగుట్టలో కొందరు మహిళలు సాముహికంగా దాడి చేశారు.

ఈ మూడు ఘటనలపై రాచకొండ కమిషనరేట్‌లోని(Rachakonda) సంబంధిత పోలీస్ స్టేషన్‌లలో టీఎస్ఆర్టీసీ అధికారులు వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. ఆ కేసుల దర్యాప్తు ప్రస్తుతం కొనసాగుతోందని, చట్టప్రకారం వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. టీఎస్ఆర్టీసీ నియమావళి ప్రకారమే సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారని, నిబంధనల మేరకే టికెట్ల జారీ ప్రక్రియను కండక్టర్లు కొనసాగిస్తున్నారని యాజమాన్యం పేర్కొంది.

ఫ్రీ బస్ ఎఫెక్ట్ ​- సీటు కోసం చెప్పులతో కొట్టుకున్న మహిళలు

Mahalakshmi Scheme in Telangana :ప్రయాణికులు ఒక వేళ టికెట్ తీసుకోకుంటే అది చెకింగ్‌లో గుర్తిస్తే ఆ సిబ్బంది ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయని, వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని, అందుకే ప్రతి ఒక్కరూ ప్రయాణ సమయంలో విధిగా టికెట్ తీసుకుని సిబ్బందికి సహకరించాలని టీఎస్ఆర్టీసీ విజ్ఞప్తి చేసింది. మహాలక్ష్మి- మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకాన్ని తమ సిబ్బంది సమర్థవంతంగా అమలు చేస్తున్నామన్నారు. ఓపిక, సహనంతో విధులు నిర్వర్తిస్తూ ప్రతి రోజూ సగటున 27 లక్షల మంది మహిళా ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతున్నారని యాజమాన్యం వెల్లడించింది.

ఒరిజనల్ గుర్తింపు కార్డు తప్పని సరి అని సిబ్బంది చెబుతున్నా, కొందరు ఇప్పటికీ ఫొటో కాపీలను, స్మార్ట్ ఫోన్‌లలో గుర్తింపు కార్డులను చూపిస్తున్నారని సంస్థ పేర్కొంది. ఇటీవల జరిగిన దాడి ఘటనలు సిబ్బందిలో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడంతో పాటు మనోవేదనకు గురిచేస్తున్నాయని సంస్థ తెలిపింది. మహాలక్ష్మి స్కీంను వినియోగించుకోవాలంటే కచ్చితంగా ఒరిజినల్ గుర్తింపు కార్డును సిబ్బందికి చూపించి.. విధిగా జీరో టికెట్ తీసుకోవాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది.

ప్రయాణికులు తమ ఫిర్యాదులు, సమస్యలను సంస్థ దృష్టికి తీసుకువచ్చేందుకు కేంద్ర కార్యాలయం బస్‌భవన్ లో పటిష్ఠమైన వ్యవస్థను సంస్థ ఏర్పాటు చేసిందన్నారు. అక్కడ 24 గంటల పాటు అందుబాటులో ఉండే టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లైన 040-69440000, 040-23450033 కాల్ చేసి సమస్యలను చెప్పవచ్చని అధికారులు తెలిపారు. ఫిర్యాదులను సోషల్ మీడియా ద్వారా ద్వారా సంస్థ దృష్టికి తీసుకురావచ్చని అధికారులు పేర్కొన్నారు. నేరుగా సమీపంలోని డిపో కార్యాలయాలకు వెళ్లి వివరించవచ్చని తెలిపారు. ఫిర్యాదు సంస్థ దృష్టికి వచ్చిన వెంటనే స్పందించి అధికారులు తగిన చర్యలు తీసుకుంటారని సంస్థ స్పష్టం చేసింది. అంతేకానీ, సహనం కోల్పోయి ఈ తరహా ఘటనలకు పాల్పడటం సరైంది కాదని ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేసింది.

ఆర్టీసీ ఉద్యోగుల ప్రమాద బీమా భారీగా పెంపు - ఎంత పెంచారంటే?

Last Updated : Jan 31, 2024, 6:03 PM IST

ABOUT THE AUTHOR

...view details