తెలంగాణ

telangana

ETV Bharat / state

మరోసారి చల్లటి కబురు చెప్పిన వాతావరణ శాఖ - రాగల 5 రోజుల పాటు వర్షాలు! - TS Weather Report Today

TS Weather Report Today : ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లని కబురు అందించింది. రాష్ట్రంలో రాగల 5 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

TS Weather Report Today
TS Weather Report Today

By ETV Bharat Telangana Team

Published : Apr 9, 2024, 8:56 PM IST

TS Weather Report Today : గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో ఎండలు విశ్వరూపాన్ని చూపిస్తున్నాయి. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మరోవైపు కొంతమంది వడదెబ్బకు గురవుతున్నారు. అయితే ఇలాంటి సమయంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణ ప్రజలకు గుడ్​న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో రాగల 5 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు (Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

గంటకు 30కి.మీ- 40 వేగంతో ఈదురుగాలులు :ద్రోణి / గాలి విచ్చిన్నతి ఉత్తర గుజరాత్ నుంచి మధ్య మహారాష్ట్ర వద్ద కేంద్రీకృతమైన ఆవర్తనం అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి. మీ. ఎత్తులో కొనసాగుతున్నదని తెలిపింది. గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కింది స్థాయి గాలులు దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి వీస్తున్నట్లు తెలిపింది. గత రెండు రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. మొన్నటి వరకు 44.5 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ఇవాళ 40 డిగ్రీలు ఉష్ణోగ్రత అధికంగా నమోదైంది. మరో 5 రోజుల పాటు ఉష్ణోగ్రతల ప్రభావం తక్కువగా ఉంటుందని వాతావరణ శాఖతెలిపింది.

IMD Issues Alert on Heat waves :ఏప్రిల్‌లోనే ఎండల తీవ్రత ఇలా ఉంటే, ఈ మాసం చివరితో పాటు మే నెలలో పరిస్థితి ఏవిధంగా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మే నెలలో ఉష్ణోగ్రతలు 48 నుంచి 49 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు ఐఎండీ (Indian Metrological Department) ఇది వరకే హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో ఎండలకు తోడు వడగాల్పుల (Heat waves) తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది. వృద్ధులు, చిన్న పిల్లలపై ఉష్ణోగ్రతలు, వడగాల్పుల ప్రభావం అధికంగా ఉంటుందని హెచ్చరించింది. ఎండల నుంచి బయటపడేందుకు దాహం వేయకపోయినా వీలయినప్పుడల్లా నీరు తీసుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. బయటకు వెళ్లినప్పుడు వెంట మంచి నీరు, మజ్జిగ లాంటి వాటిని తీసుకెళ్లటం మంచిదని చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details