తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రి థర్మల్‌ విద్యుత్​ కేంద్రాల పనుల్లో ఆలస్యం - నిర్మాణ సంస్థకు రూ.460 కోట్ల జరిమానా - TS Genco fined BHEL Huge Amount - TS GENCO FINED BHEL HUGE AMOUNT

TS Genco fined BHEL : థర్మల్‌ విద్యుత్కేంద్రాల పనుల్లో కాంట్రాక్టు ఒప్పందాల గడువు దాటినా పూర్తి చేయకుండా జాప్యం చేస్తున్నందు నిర్మాణ సంస్థ భెల్‌(బీహెచ్‌ఈఎల్‌)కు తెలంగాణ జెన్‌కో రూ.460 కోట్లు కట్టాలని జరిమానా విధించింది. యాదాద్రి థర్మల్‌ కేంద్రం పనుల్లో జాప్యానికి తాజాగా రూ.344 కోట్లు, భద్రాద్రి జిల్లా ఏడూళ్ల బయ్యారం వద్ద చేపట్టిన భద్రాద్రి ప్లాంటు నిర్మాణంలో జాప్యానికి గతంలోనే రూ.116 కోట్ల జరిమానా కట్టాలని ఆదేశించింది.

YADADRI POWER PLANTS WORKS
TS Genco fined BHEL (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : May 18, 2024, 1:35 PM IST

TS Genco Fined BHEL : థర్మల్‌ విద్యుత్కేంద్రాల పనుల్లో జాప్యంపై నిర్మాణ సంస్థ భెల్‌(బీహెచ్‌ఈఎల్‌)కు తెలంగాణ జెన్‌కో భారీ జరిమానా విధించింది. కాంట్రాక్టు ఒప్పందాల సమయంలోపు పూర్తి చేయకుండా జాప్యం చేస్తున్నందుకు రూ.460 కోట్లు కట్టాలని భెల్‌కు జరిమానా విధించింది. నల్గొండ జిల్లా దామరచర్ల సమీపంలో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్‌ కేంద్రం పనుల్లో జాప్యానికి తాజాగా రూ.344 కోట్లు, భద్రాద్రి జిల్లా ఏడూళ్ల బయ్యారం వద్ద చేపట్టిన భద్రాద్రి ప్లాంటు నిర్మాణంలో జాప్యానికి గతంలోనే రూ.116 కోట్ల జరిమానా విధించింది. భెల్‌కు చెల్లించాల్సిన బిల్లుల నుంచి ఈ నిధులు నిలిపివేసింది.

జెన్​కో సంస్థ బిల్లుల చెల్లింపులు నిలిపివేయడం తగదని, యాదాద్రి ప్లాంటు పనుల్లో జాప్యం వల్ల ఇప్పటికే తమ సంస్థకు నష్టం వస్తోందని జరిమానా పేరుతో అదనంగా వసూలు తగదని భెల్‌ సంస్థ తాజాగా జెన్‌కోకు లేఖ రాసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ప్లాంటు నిర్మాణ గడువును 2025 మార్చి 31 వరకు పొడిగించాలని కోరినట్లు సమాచారం.

Yadadri power plant: యాదాద్రి థర్మల్ ప్లాంట్ నిర్వాసితుల తరలింపు పూర్తి

విద్యుత్​ ఉత్పత్తి ప్రారంభం కాలేదు: యాదాద్రి ప్లాంటు నిర్మాణ అంచనా వ్యయం రూ.17,950 కోట్లని మొదటిగా భెల్​కు 2015 జూన్​ 1న టీఎస్​జెన్​కో ఇచ్చిన లేఖలో పేర్కొంది. కానీ, పర్యావరణ అనుమతి 2017 జూన్‌ 29న రావడంతో నిర్మాణం ప్రారంభంలోనే తీవ్ర జాప్యం జరిగింది. ఈసీ వచ్చిన తర్వాత నిర్మాణ వ్యయం రూ.20,379 కోట్లు అని, నిర్మాణ ప్రారంభ తేదీ 2017 అక్టోబరు 10 అని నిర్ణయించి జెన్‌కో భెల్‌కు మరో ఉత్తర్వులను జారీ చేసింది. దీని ప్రకారం ప్లాంటులోని మొత్తం 5 యూనిట్లకి 2020 అక్టోబరు నాటికి రెండింటిలో, 2021 అక్టోబరుకి మరో మూడింటిలో విద్యుదుత్పత్తి ప్రారంభించాలని ఒప్పందం కుదుర్చుకున్నాయి. కానీ ప్రస్తుతానికి ఒక్క యూనిట్​లోనూ విద్యుత్​ ఉత్పత్తి ప్రారంభం కాలేదు.

TS Genco and BHEL Agreement : కొన్ని రోజుల తరవాత ధరలు పెరిగాయని అంచనా వ్యయాన్ని రూ.20,444 కోట్లకు జెన్​కో పెంచారు. ఈ కాంట్రాక్టు ఒప్పందం చేసుకునే సమయంలో ‘ధరల్లో మార్పు నిబంధన’ (ప్రైస్‌ వేరియేషన్‌ క్లాజ్‌-పీవీసీ)ను పెట్టడానికి జెన్‌కో అంగీకరించలేదు. దీంతో నిర్మాణం పూర్తయ్యేలోగా ధరలు పెరిగినా వ్యయం పెంచేది లేదని రూ.20,444 కోట్లే చెల్లిస్తామని జెన్‌కో కాంట్రాక్టు ఒప్పందంలో తెలిపింది. నిర్మాణంలో జాప్యం జరిగితే చెల్లింపులపై 5 శాతం సొమ్మును ‘లిక్విడిటీ డామేజెస్‌’(ఎల్‌డీ) పేరుతో జరిమానా వేస్తామనే షరతునూ ఒప్పందంలో జెన్‌కో పెట్టగా భెల్‌ అంగీకరించింది.

ఆ అంశాలపై కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖకు నివేదిక పంపాలని జెన్​కో నిర్ణయం

పెరిగిన నిర్మాణ వ్యయం : 2021 అక్టోబరు నాటికి పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి ప్రారంభం కావాల్సి ఉండగా పలుమార్లు గడువు పొడిగించిన జెన్‌కో చివరగా 2024 డిసెంబరుగా నిర్ణయించింది. అయితే, ఇది కూడా సరిపోదని గడువును 2025 మార్చి 31 వరకూ పొడిగించాలని భెల్‌ తాజాగా అడిగింది. ఇప్పటికే దీని నిర్మాణ వ్యయం పెరిగి మొత్తం రూ.34,450 కోట్లకు చేరుకుంది. పైగా దీనిపై రూ.29 వేల కోట్ల రుణాన్ని తీసుకున్నందున ‘నిర్మాణం జరిగే కాలంలో వడ్డీ’ (ఇంట్రెస్ట్‌ డ్యూరింగ్‌ కన్‌స్ట్రక్షన్‌-ఐడీసీ)ని జెన్‌కో చెల్లిస్తోంది. ఐడీసీ భారం 2024 డిసెంబరు నాటికి రూ.8,400 కోట్లకు చేరనుంది.

ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం : భెల్‌ అడిగినట్లుగా మరోసారి గడువు పొడిగిస్తే ఐడీసీ భారం రూ.8,745 కోట్లకు చేరుతుందని ఇంత వడ్డీని విద్యుదుత్పత్తి ప్రారంభానికి ముందే చెల్లించడం వల్ల ప్రజలపై ఆర్థిక భారం పడుతుందని జెన్‌కో భావిస్తోంది. ప్లాంటు నిర్మాణంలో జాప్యంతో ఇక్కడ ఉత్పత్తయ్యే కరెంటు యూనిట్‌ ధర రూ.6 దాటుతుందని విద్యుత్‌ ఇంజినీర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ‘యాదాద్రి’ నిర్మాణంలో జాప్యానికి బాధ్యత వహిస్తూ ఎల్‌డీ కింద రూ.344 కోట్ల జరిమానాను చెల్లించాలని భెల్‌కు తాఖీదును జారీ చేసింది. గతంలో కూడా భద్రాద్రి ప్లాంటు పనుల్లో ఆలస్యం చేసినందుకు రూ.116 కోట్లు ఎల్​డీ పేరుతో జరిమానా విధించినా ఆ సంస్థ చెల్లించలేదు. దీంతో జెన్​కో చెల్లించాల్సిన బిల్లుల నుంచి మొత్తం రూ.460 కోట్లు నిలిపివేసింది. ఈ ప్లాంట్​ నిర్మాణంపై జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ జ్యుడీషియల్‌ విచారణ జరుపుతోంది.

Yadadri Power Plant TOR Issue : యాదాద్రి ప్లాంట్ టీఓఆర్ జారీపై నెలకొన్న అనిశ్చితి.. థర్మల్ విద్యుత్​కు మోక్షం ఎప్పుడో..?

ABOUT THE AUTHOR

...view details