ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీసులపై గిరిజనుల దాడి- సీఐ, కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలు - People Attack On Police

Tribals Attacked Police in Khammam District తెలంగాణ ఖమ్మం జిల్లాలో పోడు భూముల విషయంలో గిరిజను వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఘర్షణను అదుపు చేసేందుకు వెళ్లిన పోలీసులపై ఓ వర్గం గిరిజనులు దాడి చేశారు. ఈ ఘటనలో పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి.

Tribals_Attacked_Police_in_Khammam_District
Tribals_Attacked_Police_in_Khammam_District

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 31, 2024, 7:50 PM IST

Tribals Attacked Police in Khammam District : ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం చంద్రాయపాలెం అటవీ ప్రాంతంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోడు భూముల విషయంలో గిరిజన వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాని చేరుకొని వారిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే గిరిజనులు పోలీసులు దాడి చేశారు. ఈ ఘటనలో సత్తుపల్లి సీఐ కిరణ్, మరో నలుగురు కానిస్టేబుళ్లకు తీవ్రగాయాలయ్యాయి.

'దాహమో రామచంద్రా' అంటున్న సీఎం సొంత జిల్లా వాసులు- దశాబ్ద కాలంగా చూడని నీటి కష్టాలు - Drinking Water Problem in Mydukur

గత కొంతకాలంగా చంద్రాయపాలెం అటవీ ప్రాంతంలోని పోడు భూముల విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నేడు బుగ్గపాడు, చంద్రయపాలెం గ్రామాలకు చెందిన గిరిజనుల మధ్య వాగ్వాదం జరగింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లగానే గిరిజనులు దాడికి పాల్పడ్డారు.

ఖమ్మం జిల్లాలో గిరిజన వర్గాల మధ్య వాగ్వాదం- అదుపు చేసేందుకు వచ్చిన పోలీసులపై దాడి

ABOUT THE AUTHOR

...view details